AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Surabhi: హీరోయిన్ సురభికి తప్పిన ప్రమాదం.. చావు నుంచి తప్పించుకున్నాను అంటూ పోస్ట్..

తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురభి చివరగా యంగ్ హీరో ఆది నటించిన శశి సినిమాలో కనిపించింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సురభికి మళ్లీ అంతగా క్రేజ్ రాలేదు. వెండితెరపై ఈ బ్యూటీ యాక్టివ్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది.

Actress Surabhi: హీరోయిన్ సురభికి తప్పిన ప్రమాదం.. చావు నుంచి తప్పించుకున్నాను అంటూ పోస్ట్..
Surabhi
Rajitha Chanti
|

Updated on: Mar 19, 2024 | 3:24 PM

Share

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సురభి సుపరిచితమే. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో టాలీవుడ్ అడియన్స్‏కు దగ్గరయ్యింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురభి చివరగా యంగ్ హీరో ఆది నటించిన శశి సినిమాలో కనిపించింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సురభికి మళ్లీ అంతగా క్రేజ్ రాలేదు. వెండితెరపై ఈ బ్యూటీ యాక్టివ్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. జస్ట్ మిస్… చావు నుంచి తప్పించుకున్నామని.. ఊహించుకుంటేనే చాలా భయంగా ఉందంటూ రాసుకొచ్చింది.

అసలు ఏం జరిగిందంటే.. “మేము విమానంలో ప్రయాణిస్తుండగా.. ఎప్పుడూ జరగని ఓ సంఘటన ఎదురైంది. చావు అంచులదాక వెళ్లొచ్చాను అనిపించింది.. మేము ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాధం జరిగే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఫ్లైట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. ఫ్లైట్ లో ఉన్నవాళ్లంతా పడిపోయాం. నా గుండె జారి నోట్లోకి వచ్చినంత పనైంది.. కానీ కొన్ని గంటల తర్వాత పైలెట్ సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ చేశారు. ఆ ఘటనని ఊహించుకుంటేనే భయంగా ఉంది. చావు నుంచి తప్పించుకున్నాను. జస్ట్ మిస్. ఇలా జరగడంతో నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం పెరిగింది” అంటూ రాసుకొచ్చింది. దీంతో సురభి పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. కానీ ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. సురభి ఎక్కడికి వెళ్తుంది ? ఏరోజున ఈ ఘటన జరిగింది.. ? ఎక్కడ ? అనే విషయాలు తెలియరాలేదు.

ఇక సురభి సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తుంది సురభి. అలాగే ఇకపై టాలీవుడ్ ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్.. ముఖ్య పాత్రలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ ఓటర్ల కోసం 16 ప్రత్యేక SIR హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు..
హైదరాబాద్‌ ఓటర్ల కోసం 16 ప్రత్యేక SIR హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు..
శుక్రుడిపై కుజుడి దృష్టి: ఆ రాశులకు విపరీతమైన ధనలాభం, లగ్జరీ లైఫ్
శుక్రుడిపై కుజుడి దృష్టి: ఆ రాశులకు విపరీతమైన ధనలాభం, లగ్జరీ లైఫ్
రాజధానిపై నిలకడలేని మాటలు మాట్లాడుతున్నారు: సీఎం
రాజధానిపై నిలకడలేని మాటలు మాట్లాడుతున్నారు: సీఎం
2వ మ్యాచ్‌లో 3 కీలక మార్పులు.. తెలుగోడికే స్పాట్ పెట్టేశారుగా..!
2వ మ్యాచ్‌లో 3 కీలక మార్పులు.. తెలుగోడికే స్పాట్ పెట్టేశారుగా..!
చల్లని వానలో వేడి వేడి అన్నంలో.. కాస్తింత వేసుకుని నెయ్యితో తింటే
చల్లని వానలో వేడి వేడి అన్నంలో.. కాస్తింత వేసుకుని నెయ్యితో తింటే
కృష్ణానదిలో త్వరలో సోలార్ బోట్ల సందడి.. ఏపీటీడీసీ కీలక నిర్ణయం
కృష్ణానదిలో త్వరలో సోలార్ బోట్ల సందడి.. ఏపీటీడీసీ కీలక నిర్ణయం
అకౌంట్ నుంచి ప్రతీ నెలా డబ్బులు కట్ అవుతున్నాయా..?
అకౌంట్ నుంచి ప్రతీ నెలా డబ్బులు కట్ అవుతున్నాయా..?
సమంత 'మా ఇంటి బంగారం' డిలీటెడ్ సీన్స్ చూశారా? వీడియో ఇదిగో
సమంత 'మా ఇంటి బంగారం' డిలీటెడ్ సీన్స్ చూశారా? వీడియో ఇదిగో
వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు