
ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం తన కెరీర్ ఆరంభం నుండి నేటి వరకు తన పాత్రల ఎంపికలో ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించారు. కేవలం నిడివిని కాకుండా, పాత్రకు ఉండే ప్రాముఖ్యత, దాని ఇంపాక్ట్ ప్రధానమని ఎప్పుడూ నమ్ముతానని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక పాత్ర చిన్నదైనా, పెద్దదైనా దానికి గౌరవం, మర్యాద ఉండాలి, లేకపోతే దానిని చేయకూడదని ఫిక్స్ అయ్యాయి. చిన్న పాత్రల విషయంలోనైతే, అవి సినిమా కథపై గణనీయమైన ప్రభావం చూపాలని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో.. దీనికి ఉదాహరణగా, కెరీర్ తొలినాళ్లలో నటించిన శుభలగ్నం చిత్రంలోని తన మూడు నాలుగు సన్నివేశాలు సినిమాపై చూపిన ప్రభావాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా, వెంకటేష్‌తో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల గురించి కూడా సుహాసిని ప్రత్యేకంగా వివరించారు.
ఈ చిత్రంలో తాను చేసిన సన్నివేశాలు, తాను మెయిన్ హీరోయిన్‌గా నటించిన ఎన్నో సినిమాల కంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా విమోచన, స్త్రీవాద కార్యకర్తలు సైతం ఆ సన్నివేశాలను ఉదాహరణలుగా చూపుతారని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు సుహాసిని కెరీర్ ఫిలాసఫీని స్పష్టంగా తెలియజేస్తాయి. ఆమె తన కెరీర్‌లో గ్లామర్ పాత్రలు చేసే హీరోయిన్‌ల మధ్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఎలా నిలుపుకోగలిగారో కూడా వివరించారు సుహాసిని. గ్లామర్‌కు బదులు తన నటనకే ప్రాధాన్యతనిచ్చి, పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యేలా చూసుకున్నారని చెప్పారు. దీనికి కారణం కొంచెం తెలివితేటలు ఉండడమేనని సుహాసిని అన్నారు. శ్రీదేవిలా గ్లామరస్‌గా, జయప్రదలా అందంగా, శ్రీప్రియలా సహజంగా నటించే వారు ఉన్నప్పటికీ, వారితో తన పోటీ కాదని, తనతోనే తనకు పోటీ అని సుహాసిని అని అన్నారు.
సుమలత లాంటి సీనియర్ నటీమణులు కూడా సుహాసిని కెరీర్ వ్యూహాన్ని ప్రశంసించారు. తన 60వ పుట్టినరోజుకు పంపిన వీడియోలో సుమలత, “మాకంతా లేదు, సుహాసినికి ఒక స్ట్రాటజీ ఉండేది. నేను ఇలాంటి పిక్చర్ చేస్తాను, ఇలాగే ఉంటాను, ఇదే నాకు కావాలి” అని ఆమె కెరీర్‌ను ప్లాన్ చేసుకున్న విధానం అద్భుతమని సుమలత చెప్పారని సుహాసిని గుర్తుచేసుకున్నారు. తాను అలా ప్లాన్ చేసుకున్నానని తనకు కూడా తెలియదని సుహాసిని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి