Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ నేను ఉన్నాను కదా అంటుంది..

|

May 21, 2023 | 10:28 AM

టాలీవుడ్ లో ఆమె క్రేజ్ హీరోలకు సరిసమానంగా ఉండేది. దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది.

Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ నేను ఉన్నాను కదా అంటుంది..
Soundarya
Follow us on

సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్రావేసుకున్నా నటీమణుల్లో సావిత్రి తర్వాత ఎక్కువగా చెప్పుకునే పేరు సౌందర్య.  ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు సౌందర్య . టాలీవుడ్ లో ఆమె క్రేజ్ హీరోలకు సరిసమానంగా ఉండేది. దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. మనవరాలి పెళ్లితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత అమ్మోరు సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ కొత్తలోనే పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సౌందర్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ నెంబర్ వన్ హీరోయిన్‌గా రాణించారు సౌందర్య. సౌందర్య మరణంతో ఆమె తల్లి డిప్రషన్ లోకి వెళ్లారు. సౌందర్య తో పాటు ఆమె సోదరుడు కూడా మరణించిన విషయం తెలిసిందే. చాల రోజుల పాటు మీడియా ముందుకు రావడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌందర్య తల్లి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. ప్రతి రోజు సౌందర్య కలలోకి వస్తుంది అని, నా మనసు బాగోలేని రోజు నా పిల్లలు ఇద్దరు కలలోకి వస్తారని, సౌందర్య అయితే నీకెందుకు మమ్మీ నేను ఉన్నాను కదా అని అంటుంది.. కానీ ఆ కల మధ్యలోనే  ఆగిపోతుందని.. అలా ఎందుకు జరుగుతుందో అర్ధంకావడం లేదు అని ఎమోషనల్ అవుతూ తెలిపారు సౌందర్య తల్లి .