కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

సహాయక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో సాహితీ దాసరి ఒకరు. ఈ చిన్నది తన నటీనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా మా ఊరి పొలిమేర సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో కనిపించింది.

కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Actress

Updated on: Feb 12, 2026 | 12:43 PM

హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలా వచ్చిన సినిమాల్లో మా ఊరి పొలిమేర అనే సినిమా ఒకటి ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను భయపెట్టింది. అప్పట్లో హాట్ స్టార్ ఓటీటీలో వచ్చిన మా ఊరి పొలిమేర సినిమా మంచి హిట్ అయింది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. బ్లక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆతర్వాత వచ్చిన పొలిమేర 2 సినిమా థియేటర్స్ లో విడుదలైంది. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలకపాత్రల్లో నటించారు. అలాగే హీరోయిన్స్ గా కామాక్షి భాస్కర్ల, సాహితి దాసరి కూడా నటించారు.

ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్

గెటప్ శ్రీను భార్యగా నటించింది సాహితి దాసరి. ఈ అమ్మడు సినిమాలో డ్రీ గ్లామర్ లుక్ లో కనిపించి మెప్పించింది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సాహితి దాసరి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తనకు క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురైందని తెలిపింది. కందరు దర్శకులు, నిర్మాతలు తనను కమిట్మెంట్స్ అడిగారు అని తెలిపింది సాహితి. అయితే నేరుగా కమిట్మెంట్ అడగరు.. కోఆర్డినేటర్లు, మేనేజర్లు, లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల వంటివారు మధ్యవర్తుల ద్వారానే అడుగుతారు అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..

ఈ మధ్యవర్తులు దర్శకుడితో కొంచెం క్లోజ్‌గా ఉండాలి, మెసేజ్‌లు చేసి మాట్లాడవచ్చు, నంబర్ ఇస్తాను, ఛాన్సులు ఎక్కువ వస్తాయి లాంటి హింట్స్ ఇస్తుంటారు. ఇలాంటి ఆఫర్స్ ను తాను తిరస్కరించానని సాహితి తెలిపారు. దాని వల్ల కొన్ని పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది సాహితీ. “ఎంత చిన్నగా ఎదుగితే అంత లాంగ్ లాస్టింగ్ ఉంటాం” అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని, “ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడూ నిలవదు” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.