AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: అమ్మబాబోయ్.. రష్మికాకు తెలియకుండా అలాంటి ఫోటో షేర్ చేసిన టీమ్.. ఫైర్ అవుతోన్న నెటిజన్స్

బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక. ఇక ఈ అమ్మడు క్రేజ్ పెరగడంతో బోల్డ్ రోల్స్ చేయడానికి వెనుకాడటం లేదు. రష్మిక మందన్న కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో కలర్‌ఫుల్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. ‘ఛలో’ సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.  విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమా చేసిన తర్వాత రష్మిక పాపులారిటీ రెట్టింపు అయ్యింది.

Rashmika Mandanna: అమ్మబాబోయ్.. రష్మికాకు తెలియకుండా అలాంటి ఫోటో షేర్ చేసిన టీమ్.. ఫైర్ అవుతోన్న నెటిజన్స్
Rashmika Mandanna
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2023 | 9:42 AM

Share

హీరోయిన్ రష్మిక మందన్న పేరు ఇప్పుడు తెగ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటిన రష్మిక. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారనుంది. బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక. ఇక ఈ అమ్మడు క్రేజ్ పెరగడంతో బోల్డ్ రోల్స్ చేయడానికి వెనుకాడటం లేదు. రష్మిక మందన్న కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో కలర్‌ఫుల్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. ‘ఛలో’ సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.  విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమా చేసిన తర్వాత రష్మిక పాపులారిటీ రెట్టింపు అయ్యింది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, నితిన్, విజయ్ దేవరకొండలతో .. అటు తమిళంలో దళపతి విజయ్, కార్తీ ఇక హిందీలో అమితాబ్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణబీర్తో కపూర్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ప్రస్తుతం రష్మిక బోల్డ్ అవతార్ లోకి మారిపోయింది. సౌత్ ఇండియన్ బ్యూటీస్ తో పోలిస్తే హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడంలో బాలీవుడ్ భామలు ముందున్నారు. ఇక్కడ కంటే బాలీవుడ్‌ సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం రష్మిక మందన్న బాలీవుడ్‌లో మెరుస్తోంది. అందుకే అక్కడి వాతావరణాన్ని అలవాటు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

రష్మిక మందన్న షేర్ చేసిన కొత్త ఫోటో మతిపోగొడుతోంది. వన్ పీస్ డ్రెస్ లో మెరిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. రష్మిక మందన్న టీమ్ తనకు తెలియకుండానే ఈ ఫోటోను పోస్ట్ చేసింది. ‘గైస్ ఈ ఫోటో ఏడాది క్రితం క్లిక్ చేసింది. రష్మికకు తెలియకుండా ఈ ఫోటో పోస్ట్ చేస్తున్నాం. అన్నీ మీ కోసమే’ అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలో బోల్డ్ గా ఫోజిచ్చింది రష్మిక .ఈ  ఫోటో చూసిన అభిమానులు వావ్ అంటున్నారు. ఈ ఫోటోకి 13 గంటల్లో 20 లక్షల లైక్స్ వచ్చాయి.

ఈ ఫోటోకు చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ ఫోటోను రష్మిక మందన్న స్వయంగా పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఫోటో పెట్టింది ఆమె కాదు అని తెలియనట్లు ఫోజులిస్తుంది అని కొందరు. మరికొందరు రష్మిక బోల్డ్‌నెస్‌ కు ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందన్న ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు చాలానే ఉంటాయి.అలాగే యానిమల్ లోనూ బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ లో చూపించిన ట్టు.. రష్మిక, రణబీర్ మధ్య చాలా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..