Rashmika Mandanna: హారర్ సినిమాలో రష్మిక మందన్న.. హీరో ఎవరంటే..

|

Jun 26, 2024 | 2:46 PM

మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. తెలుగు తో పాటు తమిళ్ లోనూ నటించింది ఈ చిన్నది. అక్కడ రెండు సినిమాలు చేసింది. కానీ ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కార్తీతో సుల్తాన్, దళపతి విజయ్ తో వారసుడు సినిమాలు చేసింది.

Rashmika Mandanna: హారర్ సినిమాలో రష్మిక మందన్న.. హీరో ఎవరంటే..
Rashmika
Follow us on

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ ముద్దుగ్గుమ్మ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. తెలుగు తో పాటు తమిళ్ లోనూ నటించింది ఈ చిన్నది. అక్కడ రెండు సినిమాలు చేసింది. కానీ ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కార్తీతో సుల్తాన్, దళపతి విజయ్ తో వారసుడు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.

బాలీవుడ్ లో ఇటీవలే యానిమల్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో నటిస్తుంది ఈ బ్యూటీ. సల్మాన్ ఖాన్ , మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ మూవీలో నటిస్తుంది ఈ చిన్నది.

రష్మిక హిందీలో హారర్ కామెడీ సినిమా చేయనుంది . దీనిపై బాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేసింది. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ముంజ్యా’ చిత్రం ఇటీవల విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఆదిత్య సర్పోథర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న కలిసి నటించనున్నారు. హారర్‌ కామెడీ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఆయుష్మాన్‌, దినేష్‌లు ‘బాలా’ చిత్రంలో కలిసి పనిచేశారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న తొలిసారి కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. అలాగే రష్మిక మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..