కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

చాలా మంది హీరోయిన్స్ వ్యాపారవేత్తలను, లేదా స్పోర్ట్స్ పర్సన్స్‌ను పెళ్లిచేసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమా వాళ్లనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్స్ దర్శకులను, హీరోలను పెళ్లి చేసుకున్నారు.

కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress

Updated on: Nov 16, 2026 | 11:37 AM

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడో, లేదా సినిమాలు తగ్గినప్పుడో బడా వ్యాపారవేత్తలను, కోటీశ్వరులను, లేదంటే స్టార్ క్రికెటర్లను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుతుంటారు. అయితే కొంతమంది తారలు మాత్రం డబ్బు, హోదా కంటే మనసుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. తమతో పాటు ఇండస్ట్రీలో పనిచేసే హీరోలనో, దర్శకులనో ప్రేమించి ఒక్కటవుతుంటారు. అలా ఒకప్పుడు టాలీవుడ్‌ను తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపిన ఓ స్టార్ హీరోయిన్.. తనకు వచ్చిన ఎన్నో కోటీశ్వరుల సంబంధాలను సున్నితంగా తిరస్కరించి, ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ అందాల తార మరెవరో కాదు.. 90వ దశకంలో కుర్రాళ్ల కలల రాకుమారిగా వెలుగొందిన నటి రాశి.

‘రావుగారి ఇల్లు’ సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమైన రాశి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. తెలుగులోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారారు. అప్పట్లో రాశి సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండేది కాదు. ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆమె, ‘దేవి అభయం’ సినిమా తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే రాశి జీవితంలో ఓ ఆసక్తికరమైన ప్రేమకథ మొదలైంది. రాశి నటించిన పలు సినిమాలకు శ్రీముని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి, అది కాస్తా గాఢమైన స్నేహంగా మారింది. అయితే, రాశి తండ్రి మరణించిన సమయంలో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆ కష్టకాలంలో శ్రీముని ఆమెకు కొండంత అండగా, మోరల్ సపోర్ట్‌గా నిలిచారు.

ఆ తర్వాత రాశికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు, కోటీశ్వరుల కుటుంబాల నుంచి సంబంధాలు వచ్చాయట. కానీ, రాశి మనసులో అప్పటికే శ్రీముని స్థానం సంపాదించుకున్నారు. కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తి జీవిత భాగస్వామి అయితే బాగుంటుందని భావించిన రాశి, వచ్చిన కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని చెప్పేశారు. అంతేకాదు, తన మనసులోని ప్రేమను నేరుగా శ్రీమునికే చెప్పి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రాశి స్వయంగా తన లవ్ స్టోరీ గురించి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే, బుల్లితెరపైనా తన సత్తా చాటారు. ముఖ్యంగా ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్ చేస్తూ కెరీర్‌ను, ఫ్యామిలీ లైఫ్‌ను ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా లీడ్ చేస్తున్నారు ఈ సీనియర్ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us