Priyanka Jawalkar: టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కల్లోలం.. కోవిడ్ బారిన పడిన ప్రియాంక జవాల్కర్..

దేశంలో కరోనా రోజు రోజూకీ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా

Priyanka Jawalkar: టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కల్లోలం.. కోవిడ్ బారిన పడిన ప్రియాంక జవాల్కర్..
Piryanka

Updated on: Jan 20, 2022 | 1:23 PM

దేశంలో కరోనా రోజు రోజూకీ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో థర్డ్ వేవ్ రాబోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వరుస సినీ తారలు కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో సినిమా షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే త్రిష, కీర్తి సురేష్, శోభన, మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక జవాల్కర్. గతేడాది తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ప్రియాంక. తాజాగా ఈ అమ్మడు కరోనా బారిన పడింది.. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.

Priyanka

హాయ్ ఎవ్రీవన్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు కరోనా పాజిటివ్ అని తేలీంది. లక్షణాలు లేకపోయిన కూడా పాజిటివ్ అని వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఐసోలేట్ అయ్యాను. సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నన్ను ఈ మధ్య కలిసిన అందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మాస్కులు ధరించండి. అవసరమైతే తప్పా బయటకు వెళ్లకండి అని కోరింది. ఇక తమ అభిమాన హీరోయిన్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..