Pragathi: ‘దిల్ సే’ మూవీ సాంగ్‌కు దుమ్మురేపిన ప్రగతి.. నెట్టింట వీడియో వైరల్

|

Sep 08, 2022 | 10:30 AM

క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న నటీమణుల్లో ప్రగతి(Pragathi) స్పెషల్ అనే చెప్పాలి. తన నటనతో ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయగలరు ప్రగతి. అక్కగా, అమ్మగా, అత్తగా వైవిధ్య మైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది

Pragathi: దిల్ సే మూవీ సాంగ్‌కు దుమ్మురేపిన ప్రగతి.. నెట్టింట వీడియో వైరల్
Pragathi
Follow us on

క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న నటీమణుల్లో ప్రగతి(Pragathi) స్పెషల్ అనే చెప్పాలి. తన నటనతో ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయగలరు ప్రగతి. అక్కగా, అమ్మగా, అత్తగా వైవిధ్య మైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ప్రగతి. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ప్రగతి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బాబీ’ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు తనలోని కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ప్రగతి. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన దూకుడు, తారక్ నటించిన బాద్షా , ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు ప్రగతి. ఇక ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రగతి. ముఖ్యంగా ఆమె చేసే వర్కౌట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. జిమ్ లో హాట్ వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు, మాస్ పాటలకు డాన్స్ లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా మరోసారి తన డాన్స్ తో ఆకట్టుకున్నారు ప్రగతి. షార్ట్ డ్రస్‌లో హీటు పెంచుతూ ప్రగతి వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మూవీ దిల్ సే లో ‘చల్ చయ్య చయ్యా’ పాటకు తన శైలిలో డాన్స్ చేసి రచ్చ చేశారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..