
సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ లో బెస్ట్ లవ్ స్టోరీ అంటే చెప్పే లిస్ట్ లో ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదే మేం వయసుకు వచ్చాం. ఈ సినిమా ఓ క్లాసిక్ అనే చెప్పాలి యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. 2012లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అందమైన ప్రేమ కథతో పాటు ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో తనీష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తనీష్ హీరోగా ఆకట్టుకున్నాడు.
అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నితి టేలర్ తన క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులనుకట్టిపడేసింది. ముఖ్యంగా ఈ అమ్మడి అందానికి తెలుగు కుర్రాలంతా ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత ఆ చిన్నది ఎక్కువగా కనిపించలేదు. నితి టేలర్ మేం వయసుకు వచ్చాం సినిమాలో ముస్లిం యువతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత బాలీవుడ్ లో నటించింది. మేం వయసుకు వచ్చాం సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు హాట్ లుక్ లోకి మారిపోయింది.
తాజాగా ఈ బ్యూటీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓటీటీ రియాలిటీ గేమ్ షో ‘అలయన్స్’ లో నితి టేలర్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ చాలా హింసించాడని, అతను ఓ సైకో అనే తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. నా మాజీ ప్రియుడు ఒకసారి నన్ను సిగరెట్‌తో కాల్చాడు. అతను ఓ సైకో. అతని పుట్టినరోజు మరింత మితిమీరిపోయాడు.. పిచ్చివాడిలా చేశాడు.. నన్ను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. దాంతో అతనికి గుడ్ బై చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు తెలిసి తెలియని వయసు. నేను చాలా చిన్నదాన్ని.. మనుషులను అంచనా వేయడం చేతకాక మోసపోయానని చెప్పుకొచ్చింది. కాగా 2020లో నితి టేలర్ పరిక్షిత్ బవా వివాహం చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి