Faria Abdullah : వరుస ఆఫర్లు అందుకుంటున్న ముద్దుగుమ్మ.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన భామ..

చేసింది ఒక్క సినిమానే అయినా ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ చిట్టీ ( ఫరియా అబ్దుల్లా ). నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు

Faria Abdullah : వరుస ఆఫర్లు అందుకుంటున్న ముద్దుగుమ్మ.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన భామ..
Fariya

Updated on: Jan 08, 2022 | 7:01 AM

Faria Abdullah : చేసింది ఒక్క సినిమానే అయినా ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ చిట్టీ ( ఫరియా అబ్దుల్లా ). నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో అందం అమాయకత్వంతో ఆకట్టుకుంది ఫరియా. ఈ హైదరాబాదీ అమ్మాయి నటన పరంగాను మెప్పించింది. జాతిరత్నాలు సినిమా మంచి విజయం సాధించింది. అలాగే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా. ఓవర్సీస్ లోనూ వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించి ట్రేడ్ వర్గాలనే షాక్ కు గురిచేసింది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి.

జాతిరత్నాలు సినిమా తర్వాత అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది ఫరియా. అలాగే కింగ్ నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక మాస్ రాజా రవితేజ నటిస్తున్న మూవీలో ఛాన్స్ దక్కించుకుంది ఈ పొడుగుకాళ్ల సుందరి. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వయ్యారి భామకు మరో అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. వరుస చిత్రాల్లో నటిస్తూ మాంచి స్పీడుమీదున్న సంతోష్ శోభన్ ఇందులో హీరో. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాను ఎంపిక చేశారు. త్వరలోనే  మరిన్ని విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్‌..

Amritha Aiyer: అమృత అయ్యర్ అందాల మెరుపులు.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

Suresh Productions: తెలుగులోకి ఆ సూపర్ హిట్.. అన్ని భాషల రీమేక్ హక్కులను సొంతం స్టార్ బ్యానర్..

Loading...
Unable to load recommendations.
Follow Us