Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..

పైన ఫోటోలో పున్నమి వెన్నెల లాంటి నవ్వుతో.. రెండు జళ్ల చిన్నారీ సీతగా కనిపిస్తున్న ఈ చిన్నది టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..
Actress

Updated on: May 11, 2022 | 12:15 PM

అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దొచుకున్న ముద్దుగుమ్మల గురించి చెప్పాల్సిన పనిలేదు. శ్రియా, త్రిష, కాజల్, తమన్నా, పూజా హెగ్డే, రాశి ఖన్నా వంటి తారలు.. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికలుగా కొనసాగుతున్నారు. వరుస ఆఫర్లను అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నవారిలో ఈ అమ్మడు కూడా ఒకరు. పైన ఫోటోలో పున్నమి వెన్నెల లాంటి నవ్వుతో.. రెండు జళ్ల చిన్నారీ సీతగా కనిపిస్తున్న ఈ చిన్నది టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రెండవ సినిమాతో సూపర్ హిట్ అందుకుని. అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి..

ఆ క్యూట్ క్యూట్ చూపుల చిన్నారి మరెవరో కాదండోయ్… తెలుగు కుర్రాళ్ల మనసు దొచుకున్న హీరోయిన్ ఛార్మీ. 2001లో నీతోడు కావాలి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత తమిళంలో కాదల్ కిసు కిసు చిత్రంలో నటించింది. సినిమాల్లోకి అరంగేట్రం చేసినప్పటికీ ఛార్మీ వయసు 14 ఏళ్లే. ఆ తర్వాత తెలుగులో నటించి శ్రీఆంజనేయం సినిమా సూపర్ హిట్ కావడంతో ఛార్మీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తర్వాత ఛార్మీకి వరుస ఆఫర్లు వచ్చాయి. గౌరి, చంటి, మాస్, చక్రం, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, స్టైల్, లక్ష్మీ, లవకుశ, మంత్ర, సుందరకాండ, జ్యోతిలక్ష్మీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలో ఛార్మీ అనుహ్యంగా సినిమాకు దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ నిర్మించి నిర్మాతగా మారింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‏తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us