
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో అతనికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే ‘రాధేశ్యాం’ టీం స్పెషల్ టీజర్‌ను విడుదల చేసి తమ హీరోకు బర్త్‌డే గిఫ్ట్‌ను అందించింది. అదేవిధంగా మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, యూకే క్రియేషన్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పూజా హెగ్డే, నివేదా థామస్, భాగ్యశ్రీ, సుధీర్ బాబు, భాగ్యశ్రీ, రాశీ ఖన్నా, వెంకటేష్, తమన్, గోపీచంద్ మలినేని, వెన్నెల కిశోర్, అనిల్ రావిపూడి, ప్రదీప్ మాచిరాజు తదితర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌కు పుట్టిన రోజు విషెస్ తెలిపారు. ఇక ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల్లో ప్రభాస్‌తో స్ర్కీన్ షేర్ చేసుకున్న స్వీటీ అనుష్క ట్వి్ట్టర్ ద్వారా తన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
ప్రతి ఒక్కటి ది బెస్ట్‌గా ఉండాలి!
‘పుట్టిన రోజు శుభాకాంక్షలు…నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్కటి ది బెస్ట్‌గా ఉండాలి. ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మందికి నీ కథలన్నీ చేరాలి. నువ్వు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్విట్టర్ ద్వారా రెబల్ స్టార్‌ను విష్ చేసింది అనుష్క. సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం 5 సినిమాల్లో నటిస్తున్నాడు. ‘రాధేశ్యాం’తోపాటు ‘సలార్’, ‘ఆది పురుష్’, ‘స్పిరిట్’తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక అనుష్క విషయానికొస్తే చివరిసారిగా ‘నిశ్శబ్ధం’ సినిమాలో కనిపించింది.
Also Read:
Ram Charan: వ్యాక్సినేషన్ సెంచరీపై రామ్ చరణ్ ట్వీట్…హిస్టారిక్ ఫీట్ అని ప్రశంసలు…
Samantha: నా హృదయంలో వీటికి ప్రత్యేక స్థానముంది….ఎట్టకేలకు నా కల నిజమైంది…