Aishwarya Rajesh: అలాంటి వారికి శిక్ష పడాలి.. ఎలాంటి కమిటీలు వద్దు.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..

|

Sep 17, 2024 | 8:06 AM

ఇప్పటికే మలయాళంలోని కొందరు నటులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ హేమ కమిటీ తరహాలో ప్రత్యేక కమిటీ కావాలని కోరుతున్నారు. ఇప్పటికే తమిళ చిత్రపరిశ్రమలో హేమ కమిషన్ తరహాలో ఒక కమిటీ కావాలని డిమాండ్ చేయడంతో నటీనటుల సంఘం నడిగర్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Aishwarya Rajesh: అలాంటి వారికి శిక్ష పడాలి.. ఎలాంటి కమిటీలు వద్దు.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..
Aishwarya Rajesh
Follow us on

మలయాళీ సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమా కమిటీ ఓ నివేదికను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలామంది మహిళలు వివక్షకు గురవుతున్నారని.. ముఖ్యంగా వారికి వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని హేమ కమిటీ నివేదిక వెల్లడించడంతో అన్ని భాషలలోనూ అలాంటి కమిటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే కొందరు నటీమణులు కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు చెబుతున్నారు. ఇప్పటికే మలయాళంలోని కొందరు నటులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ హేమ కమిటీ తరహాలో ప్రత్యేక కమిటీ కావాలని కోరుతున్నారు. ఇప్పటికే తమిళ చిత్రపరిశ్రమలో హేమ కమిషన్ తరహాలో ఒక కమిటీ కావాలని డిమాండ్ చేయడంతో నటీనటుల సంఘం నడిగర్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

అయితే హేమ లాంటి కమిటీ తమిళ చిత్రపరిశ్రమకు అవసరంలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఐశ్వర్యరాజేష్. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటిగా చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై సందడి చేసిన ఐశ్వర్య.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పిస్తుంది. విభిన్నమైన కథలను.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. తమిళంలో అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న ఐశ్వర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళంలోనూ పలు సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే .. ఇటీవల ఓ భేటీలో ఐశ్వర్య స్పందిస్తూ తనకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి వేధింపులు ఎదుర్కొలేదని చెప్పుకోచ్చింది.

“ఇండస్ట్రీలో నాకు ఇప్పటివరకు అలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కానీ అలాంటి ఘటనలు జరగకూడదనే కోరుకుందాం. తమిళ చిత్రపరిశ్రమలో ఇలాంటి విషయాలు జరగలేదు. అందుకే ఇక్కడ హేమ తరహా కమిటీ అవసరంలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ఎలాగైనా అడ్డుకోవాలి.. అందుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలి. మహిళల రక్షణే ముఖ్యం” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.