ఇప్పుడున్న హీరోల్లో అతనంటే చాలా ఇష్టం.. అతని యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాను

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన వారిలో ఆమని ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన నటనతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు ఆమని. ఇక ఇప్పుడు ఆమని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు, సీరియల్స్ చేస్తున్నారు ఆమని.

ఇప్పుడున్న హీరోల్లో అతనంటే చాలా ఇష్టం.. అతని యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాను
Aamani

Updated on: Apr 28, 2026 | 9:33 AM

ఒకప్పుడు అందంతో కుర్రాళ్లను కట్టిపడేసిన అందాల భామ ఆమని.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ఆమని. నటి ఆమని తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, మత విశ్వాసాలు, అలాగే యువ తరం నటులపై తన అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన జీవితాన్ని సింగిల్ హ్యాండ్ ఫైట్ గా అభివర్ణించిన ఆమె, చిన్నతనం నుంచే తన ఇంటి బాధ్యతలను తనే చూసుకున్నానని, తల్లిదండ్రుల బాధ్యతలు కూడా తనే స్వీకరించానని తెలిపారు. తన ఇంట్లో ప్రతి వస్తువు తనకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం తనదని, ఆ అభిరుచే తన జీవితంలోని ఇతర రంగాలపై కూడా ప్రభావం చూపిందని చెప్పారు.

ఇది కూడా చదవండి :  Sudha: నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు.. ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు..

ఆమని తన వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టమైన ఇంటర్ ఫెయిత్ వివాహం గురించి కూడా మాట్లాడారు. తనకు మతాలపై నమ్మకం లేదని, తన దృష్టిలో ఆడ, మగ మాత్రమే ఉంటారని, మత భేదాలు లేవని స్పష్టం చేశారు. తాను బాలాజీని పూజిస్తానని, అలాగే అల్లాను లేదా జీసస్‌ను పూజించడం తప్పని తాను ఎప్పుడూ అనుకోనని చెప్పారు. తనకు నచ్చితే చర్చికి వెళ్తానని, తన మత విశ్వాసాలను ఎవరిపైనా రుద్దనని, ఇతరుల పద్ధతులను తప్పుపట్టనని ఆమె అన్నారు. తన తల్లి కూడా తన వ్యక్తిగత నిర్ణయాలపై ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టవద్దని మాత్రమే ప్రోత్సహించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. హీరోయిన్‌గా మారడానికి తాను ఎంత కష్టపడ్డానో తన తల్లి చూసిందని, అందుకే ఆ రంగంలో కొనసాగాలని ఆమె కోరుకుందని తెలిపారు. తన తల్లి ఇప్పటికీ తన సినిమాలు, ఇంటర్వ్యూలు టీవీలో చూస్తూ ఆనందిస్తుందని ఆమని పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు ఈవెంట్‌లో పన్నీరు చల్లింది.. ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడికి క్రేజ్ మాములుగా లేదు

తనకు వృత్తి జీవితంలో ఎటువంటి ఒత్తిడి లేదని, చాలా సంతోషంగా ఉన్నానని ఆమని అన్నారు. తన ప్రపంచం తన ప్రొఫెషనల్ కెరీర్ అలాగే తన పిల్లలు మాత్రమేనని చెప్పారు. షూటింగ్ పూర్తవగానే వెంటనే ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తానని, తన పిల్లలు తన కోసం ఎదురుచూస్తుంటారని తెలిపారు. వారితో గడిపే సమయంలో అన్ని ఒత్తిళ్లను మర్చిపోతానని చెప్పారు. సినిమా కెరీర్ విషయానికి వస్తే, తాను పెద్ద దర్శకులైన కోడూరు గంగయ్య నాయుడు, ఈ.వి.వి. సత్యనారాయణ వంటివారితో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. చిరంజీవితో నటించలేకపోయినా, ఆయన కుమారుడు రామ్ చరణ్‌తో అవకాశం వస్తే సంతోషంగా చేస్తానని తెలిపారు. ఇటీవల మహేష్ బాబు సినిమాలో నటించానని, జూనియర్ ఎన్.టి.ఆర్. అంటే తనకు చాలా ఇష్టమని ఆమని వెల్లడించారు. ఆయన ఎనర్జిటిక్ డాన్స్‌లు, మాస్ సినిమాలు బాగా చూస్తుంటానని, బిగ్ బాస్ హోస్ట్‌గా ఆయన పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆయన అంత చిన్న వయసులోనే అంత చక్కగా మాట్లాడటం, షో నడపడం చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగులో అతనంటే పిచ్చి.. నా ఫేవరెట్ హీరో ఆయనే.. మనసులో మాట చెప్పిన కృతిశెట్టి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us