AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాక్సిక్ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరల పెంపు.. ఎంతంటే..?

TOXIC సినిమాకు తెలంగాణలో 26 ఆగస్టు నుంచి 4 సెప్టెంబర్ వరకు టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్/స్పెషల్ థియేటర్లలో రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు. ఈ పెంపు 10 రోజుల పాటు, రోజుకు 5 రెగ్యులర్ షోలకు వర్తిస్తుంది.

టాక్సిక్ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరల పెంపు.. ఎంతంటే..?
Yash In Toxic
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2026 | 1:37 PM

Share

యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన TOXIC సినిమా విడుదలకు తెలంగాణలో రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులు ఆగస్టు 25న మెమో జారీ చేశారు. సినిమా విడుదల తేదీ అయిన ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉండనున్నాయి. ప్రభుత్వ అనుమతి ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. ఈ పెంపు 10 రోజుల పాటు రోజుకు ఐదు రెగ్యులర్ షోలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ అదనపు ధరల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది.

నిర్మాతలపై మరో బాధ్యత

టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రభుత్వం చిత్ర నిర్మాతలకు మరో కీలక షరతు విధించింది. నిర్మాణ సంస్థ KVN-మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ LLP రూ.1 కోటిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఖాతాకు తప్పనిసరిగా చెల్లించాలి. సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

అవగాహన ప్రకటనలు తప్పనిసరి

థియేటర్లలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే ప్రకటనలను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. టికెట్ ధరల పెంపు నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నది జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సినిమా లైసెన్సింగ్ అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

దీంతో టాక్సిక్ విడుదల సందర్భంగా తెలంగాణలో 10 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు అందుబాటులోకి రానున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతితో థియేటర్ల వద్ద టికెట్ ధరలు సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి.

Follow Us