Kingdom Pre Release Event: విజయ్‌తో సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు.. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా కింగ్ డమ్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఇదే సినిమాలో మలయాళ నటుడు వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీలో అతనే మెయిన్ విలన్ అని తెలుస్తోంది.

Kingdom Pre Release Event: విజయ్‌తో సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు.. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kingdom Movie Pre Release Event

Updated on: Jul 29, 2025 | 6:30 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. సోమవారం(జూలై 26) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అనిరుధ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నటుడు వెంకటేష్ మాట్లాడుతూ, “మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన నేను.. ఇప్పుడు ‘కింగ్‌డమ్’లో భాగమయ్యాను. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఇప్పటిదాకా నేను పని చేసిన బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితారలో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సత్యదేవ్ గారు గొప్ప నటుడు. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. తెలుగులో నేను విజయ్ దేవరకొండ గారితో ‘కింగ్‌డమ్’ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. గౌతమ్ గారు ఈ సినిమాలో నా నటనను మెచ్చుకోవడం గర్వంగా అనిపించింది.” అన్నారు.

సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో నటులు రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, కళా దర్శకుడు అవినాష్‌ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, గీత రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొని ‘కింగ్‌డమ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు వెంకటేష్ ఫుల్ స్పీచ్ .. వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us