Sivakarthikeyan: తెలుగు నేర్చుకుంటున్న తమిళ్ స్టార్ హీరో… అసలు విషయం చెప్పేసిన శివకార్తికేయన్..

|

Oct 07, 2021 | 12:41 PM

రెమో, సీమ రాజా, శక్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ప్రధాన పాత్రలో

Sivakarthikeyan: తెలుగు నేర్చుకుంటున్న తమిళ్ స్టార్ హీరో... అసలు విషయం చెప్పేసిన శివకార్తికేయన్..
Sivakarthikeyan
Follow us on

రెమో, సీమ రాజా, శక్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. స్టార్‌ హీరో విజయ్‌ ‘బీస్ట్‌’ కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌… గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న ‘డాక్టర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్‌ హైదరాబాద్‌ వచ్చారు. తెలుగు సినీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

వరుణ్ ఆర్మీ్ డాక్టర్. తన సొంతూరుకు వచ్చి ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అనేది కథ. ట్రైలర్‌లో చూపించినట్టు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ సినిమాలో ఉన్నాయి. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమాలో చూడాలి. యాక్షన్‌, థ్రిల్‌ మూడ్‌లో సినిమా ఉంటుంది. కానీ, సినిమాలో ఎక్కువ ఫైట్స్‌ లేవు. రెండు ఫైట్స్‌ మాత్రమే ఉన్నాయి. హీరో, విలన్‌ మధ్య థ్రిల్‌ మూమెంట్స్‌ చాలా ఉంటాయి. నేరుగా కొట్టుకోరు. కానీ, ఇద్దరి మధ్య మైండ్‌ గేమ్‌ నడుస్తుంది. ఫిజికల్‌ ఫైట్‌ కాకుండా… మెంటల్‌ ఫైట్‌లా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ట్రైలర్‌ చూస్తే… అందులో ఎటువంటి ఎమోషన్‌ లేకుండా కనిపిస్తానో, అలా! వరుణ్‌ పాత్ర భావోద్వేగాలను బయటకు చూపించదు. ఎప్పుడూ నవ్వడు, ఏడ్వడు, కోప్పడడు. ఎటువంటి ఎమోషన్‌ లేకుండా నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో నాకు ఎదురైన ఛాలెంజ్‌ అదే.

దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. టీవీలో నేను షోస్‌ చేసినప్పటి నుంచి తెలుసు. నేను 2007లో టీవీ కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే… ఆ షోను నెల్సన్‌ డైరెక్ట్‌ చేశాడు. తనపై నాకున్న నమ్మకమే సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి కారణం. సినిమా ఫస్ట్‌ కాపీ వరకూ ప్రొడ్యూస్‌ చేయడం నా పని. ఆ తర్వాత మొత్తం విడుదల వ్యవహారాలు కె.జె.ఆర్‌ స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌ చూస్తారు. లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు తెలుగులో ఆ సినిమా విడుదలైంది. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ను అప్రిషియేట్‌ చేయాలి. లేదంటే ఓటీటీకి సినిమా వెళ్ళేది. తమిళనాడులో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను అప్రిషియేట్‌ చేస్తున్నారు. తెలుగులో నేరుగా సినిమా చేయబోతున్నాను. అందుకోసం తెలుగు నేర్చుకుంటున్నా. నాకు తెలుగు కొంచెం వచ్చు. మీరు మాట్లాడేది అర్థమవుతుంది. నెక్ట్స్‌ టైమ్‌ హైదరాబాద్‌ వస్తే… పూర్తిగా తెలుగులో మాట్లాడతా. ఈ సినిమా నా ప్లాన్‌లో లేదు. సెకండ్‌ వేవ్‌లో ఓ ఫ్రెండ్‌ ‘ఇటువంటి కథ ఉంది’ అని చెప్పాడు. దర్శకుడికి నేను చేయగలననే నమ్మకం ఉంది. ఓకే చేశా. ఈ సినిమా చేయడానికి హీరోయిన్లందరూ నాకు స్ఫూర్తి. వాళ్లు ఓ రోజు చెన్నైలో, మరో రోజు హైదరాబాద్‌లో, ముంబైలో చిత్రీకరణ చేస్తారు. డైలాగులు రాసుకుని, మీనింగ్‌ తెలుసుకుని ప్రాక్టీస్‌ చేస్తారు. నేనూ అలా కష్టపడాలని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు శివ కార్తికేయన్..

Also Read: Rakul Preet Singh: ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం.. కొండపొలం నాకు పెద్ద సవాలు.. ఓబులమ్మ ముచ్చట్లు..

Prabhas: ప్రభాస్ 25వ సినిమా అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. టైటిల్ పేరెంటో తెలుసా..