
తెలుగు రాష్ట్రాల్లో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గురువారం (మార్చి 26) ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపరం మండలం రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాద చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ బస్సు ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించాడు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
‘నాకు తెలిసి గత 6 నెలల్లో ఇది నాలుగో బస్సు ప్రమాదం. ఈ ఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. అధికారులు అన్ని ట్రావెల్స్ బస్సులు, రవాణా సంస్థలను తనిఖీ చేయాలి’ అంటూ పీఎం నరేంద్రమోడీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులను ట్యాగ్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
This is the 4th such Bus Tragedy in the last 6 months im reading about which has claimed almost a 100 Lives.
When will this Stop ? Radical Extreme Steps have to be taken. All Travels Buses & Transport companies need to be Inspected & Regulated at once by the Authorities.… https://t.co/5pymjzh35A— Nikhil Siddhartha (@actor_Nikhil) March 26, 2026
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్వయంభు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. అలాగే సంయుక్తా మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కె.జి.యఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Swayambhu is the Story of an UNDERDOG who has BIG dreams.. just like most of us ..
This is just the INTRODUCTION to the World Of Swayambhu.. a lottt moreee coming uppp.. l Hope u all like it… Plz do Support and Bless us 🙏🏽
WATCH WITH EARPHONES 👇🏾 https://t.co/7Iqz8KEKTg pic.twitter.com/MqQsf76mIT— Nikhil Siddhartha (@actor_Nikhil) February 11, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.