అప్పుడు స్టార్ హీరోలు కూడా నాకోసం ఎదురుచూశారు.. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ మారి సినిమాలు చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.? హీరోయిన్ ప్రేమ, భానుచందర్, వనీత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన దేవి సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు

అప్పుడు స్టార్ హీరోలు కూడా నాకోసం ఎదురుచూశారు.. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు
Tollywood

Updated on: Sep 13, 2026 | 11:19 AM

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోలు, హీరోయిన్లుగా ఎదిగిన నటీనటులు చాలామంది ఉన్నారు. చిన్నతనంలోనే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన కొందరు బాలనటులు.. పెద్దయ్యాక కూడా అదే రంగంలో కొనసాగుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఒకరే మహేంద్రన్.  ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న మహేంద్రన్.. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. హీరోయిన్ ప్రేమ, భానుచందర్, వనీత విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దేవి’ సినిమాలో మహేంద్రన్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా.. బాలనటుడిగా తన టాలెంట్ ఏంటో నిరూపించాడు. అలాగే మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ సినిమాలో కూడా కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

1994లో కోలీవుడ్‌లో బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన మహేంద్రన్.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి దాదాపు 130 సినిమాల్లో నటించాడు. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తెలుగులో ‘ఆహా’, ‘దేవి’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘నీ స్నేహం’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించాడు. ముఖ్యంగా ‘దేవి’, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాల్లో అతని నటనకు గాను ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారాలు కూడా అందుకున్నాడు. బాలనటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న మహేంద్రన్.. ఆ తర్వాత చదువులపై దృష్టి పెట్టేందుకు సినిమాలకు కొంతకాలం దూరమయ్యాడు. బాలనటుడిగా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. పెద్దయ్యాక సినిమాల్లోకి తిరిగి రావడం మాత్రం అంత సులభంగా జరగలేదట. అయితే పట్టుదలతో ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించాడు మహేంద్రన్.

ఇవి కూడా చదవండి

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

హీరోగా తమిళంలో పలు సినిమాలు చేసిన మహేంద్రన్.. ఇతర హీరోల చిత్రాల్లోనూ ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో యంగ్ భవాని పాత్రలో కనిపించింది కూడా మహేంద్రనే. ఇలా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను కొనసాగిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మహేంద్రన్ సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు తన కోసం స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఎదురుచూసేవారని.. అదే ఆతర్వాత సినిమాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని మహేంద్రన్ చెప్పాడు. “ఒక సమయంలో నా కెరీర్ మంచి పీక్‌లో ఉండేది. ఒకే రోజు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. రోజుకు మూడు విమానాల్లో ప్రయాణించేవాడిని. ఉదయం తమిళనాడులో షూటింగ్ చేస్తే.. మధ్యాహ్నం పొలాచీలో, రాత్రికి హైదరాబాద్‌లో షూటింగ్ చేసేవాడిని. నా కోసం స్టార్స్ కూడా ఎదురుచూసేవారు. నాకోసం ప్రత్యేకంగా నైట్ షూట్స్ పెట్టేవారు” అని మహేంద్రన్ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు. అయితే బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. పెద్దయ్యాక మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మహేంద్రన్ చెప్పాడు. “నాకు మధ్యలో సినిమాలు లేకుండా పోయాయి. ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. పెద్దయ్యాక కూడా ఆఫర్స్ రాలేదు. హీరోలా లేవు.. చిన్నోడివి కాదు, పెద్దోడివి కాదు అంటూ నన్ను రిజెక్ట్ చేశారు. ఆ సమయంలో చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాను” అని తన బాధను పంచుకున్నాడు.

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us