Chiranjeevi: ఆపద్బాంధవుడు..! చిరంజీవి సూచనతో ఫిష్ వెంకట్‌కు వైద్యం..!

|

Sep 10, 2024 | 11:56 AM

ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఫిష్ వెంకట్. ఆయన ఎక్కువగా హాస్య ప్రధాన, సహాయ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు, ప్రస్తుతం ఫిష్ వెంకట్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా ఫిష్ వెంకట్ ఇంటికే పరిమితం అయ్యాడు. ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు.

Chiranjeevi: ఆపద్బాంధవుడు..! చిరంజీవి సూచనతో ఫిష్ వెంకట్‌కు వైద్యం..!
Chiranjeevi
Follow us on

చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు నటుడు ఫిష్ వెంకట్. విలన్ గ్యాంగ్‌లో ఉంటూ కామెడీ పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఫిష్ వెంకట్. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఫిష్ వెంకట్. ఆయన ఎక్కువగా హాస్య ప్రధాన, సహాయ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు, ప్రస్తుతం ఫిష్ వెంకట్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా ఫిష్ వెంకట్ ఇంటికే పరిమితం అయ్యాడు. ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం సహకరించక.. ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు ఫిష్ వెంకట్. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురికావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్  ఫిష్ వెంకట్‌ను ఇంటర్వ్యూ చేశారు.

ఇది కూడా చదవండి :మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..

ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కష్టాలను పంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయన దీన స్థితిని వెలుగులోకి వచ్చింది. దాంతో ఆయనకు సాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఫిష్ వెంకట్ కాలుకు వైద్యం చేశారు డాక్టర్స్.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఫిష్ వెంకటేష్ దీన స్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అపోలో హాస్పటల్స్‌లో ఫిష్ వెంకట్‌కు ఉచితంగా వైద్యం చేయించేలా డాక్టర్స్‌తో మాట్లాడారట చిరు.

ఇది కూడా చదవండి : Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను

ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్‌‌కు చికిత్సను డాక్టర్స్ ప్రారంభించారని తెలుస్తోంది. అంతే కాకుండా చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్‌ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట. చిరంజీవి గతంలోనూ చాలా మంది మూవీ ఆర్టిస్ట్‌లకు సాయం చేశారు. అలాగే రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల వరదబాధితులకు రూ. 1 కోటి రూపాయిలు సాయం చేశారు మెగాస్టార్. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటించి మెప్పించాలని కోరుకుందాం !

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.