Adi Sai Kumar : కొడుకు పేరు రివీల్ చేసిన ఆది సాయి కుమార్.. అర్థం ఏంటో తెలుసా.. ?

ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత ఆ స్థాయిలో హిట్ రాలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆది సాయికుమార్.. ఇటీవలే శంబాల సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా తన కొడుకు పేరు రివీల్ చేశారు.

Adi Sai Kumar : కొడుకు పేరు రివీల్ చేసిన ఆది సాయి కుమార్.. అర్థం ఏంటో తెలుసా.. ?
Aadi Saikumar

Updated on: Mar 28, 2026 | 8:27 PM

టాలీవుడ్ యంగ్ హీరో, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కక్కర్లేదు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా తెలుగు పరిచయమైన ఆది.. ఆ తర్వాత ఆ స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయారు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆది.. ఇటీవల శంబాల సినిమాతో సాలిడీ రీఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఆది సాయికుమార్ ఇంట్లో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. ఇటీవల ఆదిసాయికుమార్, అరుణ దంపతులకు ఈ ఏడాది కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొడుకు పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, ఆ పేరు వెనుక ఉన్న విశిష్టతను కూడా వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‏కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?

ఆది సాయికుమార్ , ఆయన భార్య అరుణ దంపతులకు ఈ ఏడాది జనవరి 2వ తేదీన మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిన్నారికి నామకరణం చేసిన ఆది, తన కొడుకు పేరును ‘ఇషాన్‌ కార్తీక్‌’ (Ishan Karthik) గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పేరు వెనుక ఒక ఆధ్యాత్మిక అంతరార్థం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఇషాన్’ అంటే శివుడు అని, ‘కార్తీక్’ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (కార్తీకేయుడు) అని అర్థం. తండ్రి, కుమారులైన శివపార్వతుల తనయుల పేర్లు కలిసేలా ఈ పేరును ఎంపిక చేసుకోవడం విశేషం. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి, ఈ ఏడాది ప్రారంభం అద్భుతంగా కలిసొచ్చింది. ఒకవైపు ఆయన నటించిన ‘శంబాల’ (Shambhala) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా, మరోవైపు వారసుడు పుట్టడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ ఏడాది తనకు ఎంతో ప్రత్యేకమని, భగవంతుడు తనకు రెట్టింపు సంతోషాన్ని ఇచ్చాడని ఆది తన పోస్ట్‌లో భావోద్వేగంగా రాసుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

ఆది సాయికుమార్ 2014లో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అరుణను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే ‘అయానా’ అనే కుమార్తె ఉంది. ఇప్పుడు కుమారుడు ఇషాన్‌ కార్తీక్ రాకతో ఈ కుటుంబం పరిపూర్ణమైందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆది తండ్రి సాయికుమార్ కూడా రెండోసారి తాత కావడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ఆది షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆది ప్రస్తుతం తన కెరీర్‌లో మరిన్ని విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..

Follow Us