Acharya Movie: మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీ నుంచి సెకండ్ సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

|

Jun 02, 2021 | 6:56 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. సైరా తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్న మూవీ.. ఆచార్య.

Acharya Movie: మెగాస్టార్ ఆచార్య మూవీ నుంచి సెకండ్ సాంగ్ వచ్చేది అప్పుడేనా..?
Acharya
Follow us on

Acharya Movie:

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. సైరా తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్న మూవీ.. ఆచార్య. ఈ మూవీ షూటింగ్.. కరోనా కారణంగా ఆగిపోయింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో చిరుతో పాటు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా షూటింగు ఇంకా 20 రోజుల పాటు జరగవలసిన సమయంలో కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా ఆ కాస్త షూటింగు పూర్తి చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు చిత్రయూనిట్ . ‘కోకాపేట’లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 20 రోజుల పాటు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చిరంజీవి .. చరణ్ .. సోనూ సూద్ కాంబినేషన్లో సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. ఆ సన్నివేశాల చిత్రీకరణను  పూర్తిచేయనున్నారు.

చాలా సంవత్సరాల తర్వాత ఆచార్య తో మెగాస్టార్ చిరు – మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మల కాంబినేషన్ సెట్ అయింది. ఇప్పటికే ‘లాహే లాహే’ అనే ఫస్ట్ సింగల్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయని టాక్. ఈ సినిమాలో సెకండ్ సాంగ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు హైలైట్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ ఆచార్య సెకండ్ సాంగ్ ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు టాక్ నడుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Chiranjeevi Konidela: ఆ చిన్నారి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది : మెగాస్టార్ చిరంజీవి

Akhanda Movie: ‘అఖండ’ సినిమా నుంచి మరో సర్‏ఫ్రైజ్.. టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్.. కెరీర్‏లోని చెదు ఘటనను గుర్తుచేసుకున్న జరీన్ ఖాన్..