
బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ నటుడు ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు గౌరీ స్రాట్ ను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరి వివాహం ఆమీర్ నివాసంలో సింపుల్ గా జరిగింది. అయితే ప్రస్తుతం ఆమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం, రెండు వివాహాలు, విడాకుల వెనుక ఉన్న కారణాలపై చర్చలు మరోసారి మొదలయ్యాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ తన రెండు వివాహాల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆమిర్ ఖాన్ 1986 ఏప్రిల్ 18న రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆయన వయసు కేవలం 21 సంవత్సరాలు. ఆయన చిత్ర పరిశ్రమలో పెద్ద పేరు సంపాదించక ముందే వివాహం చేసుకున్నారు. ‘కాఫీ విత్ కరణ్’ షోలో మాట్లాడుతూ, తన మొదటి విడాకుల సమయంలో తాను చాలా చిన్నవాడినని, అపరిపక్వంగా ఉన్నానని ఆమిర్ ఖాన్ చెప్పారు. అందుకే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
రీనా దత్తా నుండి విడిపోవడం తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని.. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయానని, కొంతకాలం మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. తన మొదటి బంధం నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని అన్నారు. ‘లగాన్’ సినిమా షూటింగ్ సమయంలో అతను కిరణ్ రావును కలిశాడు. వారి స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ఆమిర్ తర్వాత 2005 డిసెంబర్‌లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ‘ఫనా’ సినిమా షూటింగ్‌కు ముందు, అతను 10 రోజుల సెలవు కోరుతూ, తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు దర్శకుడు కునాల్ కోహ్లీకి తెలియజేశాడు.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
చాలా సంవత్సరాల వివాహం తర్వాత, ఆమిర్ ఖాన్ , కిరణ్ రావు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల తర్వాత, కిరణ్ రావు మరింత స్వతంత్ర జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారని ఆమిర్ చెప్పారు. ఆమె కోరికలను గౌరవిస్తూ, ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక రెండేళ్లుగా గౌరీతో డేటింగ్ లో ఉన్న ఆమీర్ ఖాన్.. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..