
70, 80వ దశకాల్లో తన అద్భుతమైన నృత్యాలు, గ్లామర్‌తో వెండితెరను ఊపేసిన నటి జయమాలిని. ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..’, ‘సన్నజాజులోయ్.. కన్నె మోజులోయ్..’ వంటి ఎన్నో ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌తో అప్పట్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఘనత ఆమెది. అప్పట్లో తన పాటలతో ఇండస్ట్రీని అల్లాడించింది. అంతేకాదు ఆమె నటించిన పాటలు అప్పటి కుర్రకారుకు పిచ్చెక్కించాయి. ఇక ఒక స్టార్ హీరో సినిమా అంటే అందులో తప్పకుండా జయమాలిని స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఆమె పాట ఉంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అనే స్థాయికి ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. 1958 డిసెంబర్ 22న మద్రాసులో జన్మించిన జయమాలిని అసలు పేరు ‘అలమేలు మంగ’. ఎనిమిది మంది సంతానంలో ఆమె చివరిది కాగా, అప్పటికే స్టార్ డాన్సర్‌గా రాణిస్తున్న జ్యోతిలక్ష్మి ఆమెకు స్వయానా అక్క. అక్క డ్యాన్స్ చూస్తూ పెరిగిన అలమేలు, కేవలం 12 ఏళ్ల వయసులోనే తన మేనమామ టి.ఆర్.రామన్న దర్శకత్వంలో వచ్చిన ఒక తమిళ చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బి.విఠలాచార్య ‘ఆడదాని అదృష్టం’ అనే సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తూ, ఆమె పేరును ‘జయమాలిని’గా మార్చారు.
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
జయమాలిని ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించినప్పటికీ, ఐటమ్ సాంగ్స్ ద్వారానే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ (1977) సినిమాలోని ‘గుడివాడ వెళ్లాను..’ పాటతో ఇండస్ట్రీని షేక్ చేశారు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో జయమాలిని పాట ఉండటం ఒక సెంటిమెంట్‌గా మారింది. సిల్క్ స్మిత వంటి వారు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ జయమాలిని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 600కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘జగన్మోహిని’, ‘గంధర్వకన్య’ వంటి చిత్రాలు ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ‘జగన్మోహిని’ చిత్రం అప్పట్లో స్టార్ హీరోల సినిమాలను మించి కలెక్షన్లు రాబట్టడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 1994లో జయమాలిని పోలీస్ ఇన్‌స్పెక్టర్ పార్తీబన్‌ను వివాహం చేసుకున్నారు. తెరపై ఎంతో గ్లామరస్‌గా కనిపించే ఆమె, నిజ జీవితంలో చాలా మితభాషి, వివాదాలకు దూరంగా ఉండే సాధారణ మహిళ. పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా చిత్ర పరిశ్రమకు ,మీడియాకు దూరమయ్యారు. ఒక సాధారణ గృహిణిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతోనే తాను సినిమాలకు స్వస్తి పలికానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలలో కనిపిస్తున్న జయమాలిని, తన కూతురికి డాన్స్ నేర్పిస్తున్నప్పటికీ ఆమెను సినీ రంగానికి పరిచయం చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనా, 20 ఏళ్లపాటు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన జయమాలిని ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
Jayamalini Life
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..