Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

బాలకృష్ణ సరసన లవర్‌గా, భార్యగా నటించడమే కాకుండా, ఒక చిత్రంలో ఆయనకు బామ్మగా కూడా నటించి అరుదైన రికార్డు సృష్టించారు స్టార్ హీరోయిన్. వీరిద్దరి కాంబినేషన్‌లోని ఈ ఆసక్తికరమైన సినీ విశేషాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 50 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది ఆ క్రేజీ బ్యూటీ..

Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
Balakrishna

Updated on: Oct 23, 2026 | 8:20 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతోమంది కథానాయికలతో నటించి ప్రేక్షకులను అలరించారు. నాటి విజయశాంతి, రాధ, సౌందర్య నుంచి నేటి శ్రుతి హాసన్, కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ వరకు ఎందరో ముద్దుగుమ్మలతో ఆయన జోడీ కట్టారు. అయితే టాలీవుడ్‌లోని ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మాత్రం బాలకృష్ణ సరసన లవర్‌గా, భార్యగా నటించడమే కాకుండా, ఆయనకు బామ్మ (నానమ్మ) పాత్రలోనూ కనిపించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ అందాల భామ మరెవరో కాదు.. సిమ్రాన్. వీరిద్దరి జోడికి సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు.. వీరు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి.

90ల కాలంలో టాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. నందమూరి బాలకృష్ణ మరియు సిమ్రాన్ కాంబినేషన్‌కు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన క్రేజ్ ఉండేది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచి సరికొత్త రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాల్లో బాలయ్యకు లవర్‌గా, భార్యగా నటించి తన నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు సిమ్రాన్.

అయితే వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్క మగాడు’ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (తాత, మనవడిగా) చేశారు. ఈ చిత్రంలో తాత పాత్రకు జోడీగా సిమ్రాన్ భార్యగా కనిపించడమే కాకుండా, ముందు భాగంలో వృద్ధురాలిగా మారి మనవడి పాత్రకు నానమ్మగా కూడా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విధంగా బాలయ్య సరసన ప్రేయసిగా, అర్ధాంగిగా , బామ్మగా కూడా నటించిన ఏకైక హీరోయిన్‌గా సిమ్రాన్ నిలిచారు.

ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌ను అనుభవించిన సిమ్రాన్, ఆ తర్వాత కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా సందడి చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి వైవిధ్యమైన పాత్రలతో రీ-ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్నారు. బాలయ్య-సిమ్రాన్ కాంబినేషన్ టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లలో ఒకటిగా నిలిచిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!

సిమ్రాన్ పోస్ట్.. 

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us