గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారీ ఆంటీ. ‘మీది మొత్తం థౌజండ్ అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా ‘ అని ఆమె చెప్పిన డైలాగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో చెప్పుక్కర్లేదు. రెండు లివర్లకు వెయ్యి రూపాయాల.. ఆమె దగ్గర భోజనం చేస్తే ఆస్తి పేపర్లు అమ్ముకోవాల్సిందే అంటూ ట్రోలింగ్ చేశారు. దీంతో ఒక్కసారిగా నెట్టింట ఆమె పేరు మారుమోగింది. ఆమె వద్ద ఉన్న ఫుడ్ ధరలపై ఓ రేంజ్లో నెగిటివిటీ ఏర్పడింది. మరోవైపు ఆమెకు మరింత పాజిటివిటీ కూడా వచ్చేసింది. వెజ్.. నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ ఆమె వద్ద బాగుంటాయంటూ ప్రచారం నడిచింది. దీంతో ఆమె వద్దకు యూట్యూబ్ ఛానల్స్ క్యూ కట్టాయి. దీంతో ఉన్నట్లుండి నెట్టింట సెలబ్రెటీ అయిపోయింది. ఇప్పటికే ఆమెను ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూ చేశాయి. ఆమె వంటల దగ్గర్నుంచి వ్యక్తిగత విషయాలు, పిల్లలు, భర్త, ఆస్తులు ఇలా అన్ని విషయాలను ఆరా తీశారు. ఇక ఇప్పుడు ఏకంగా బుల్లితెరపై ఓ ఛానల్లో నిర్వహించి రియాల్టీ షోలోను ఆమె పాల్గొంది.
నెట్టింట పాపులారిటీని బట్టి.. ఆమె త్వరలోనే ఏదొక టీవీ షోలో పాల్గొనడం ఖాయమనుకున్నారు అంతా. ఇక ఇదే విషయంపై నెట్టింట వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ కు సంబంధించిన ఓ ఈవెంట్లో సందడి చేసింది కుమారీ ఆంటీ. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరితో కలిసి బిగ్ బాస్ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి కుమారి ఆంటీని అతిథిగా తీసుకువచ్చారు. బిగ్ బాస్ స్టేజ్ పై కూడా కుమారీ ఆంటీ ఆమె చేతి వంట రుచి చూపించినట్లు తెలుస్తోంది. నాన్ వెజ్ భోజనాన్ని అందిరికీ వడ్డించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో రోడ్డు పక్కన వెజ్, నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తుంటుంది కుమారీ ఆంటీ. అయితే ఆమె తీసుకువచ్చే ఫుడ్ టెస్ట్ బాగుండడంతో ఆమె షాప్ దగ్గరకు జనాలు ఎక్కువగా వచ్చేవారు. అదే సమయంలో మీది మొత్తం థౌజండ్ అయ్యింది రెండు లివర్లు ఎక్స్ ట్రా అని చెప్పడంతో ఒక్కసారిగా నెట్టింట ఫేమస్ అయ్యింది. దీంతో ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబర్స్, ఫుడ్ వ్లాగర్స్ క్యూ కట్టారు. ఈ క్రమంలోనే రోడ్డు పై ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుందని ఆమె షాప్ మూసివేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ఈ గొడవపై తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి స్పందించడంతో ఇప్పుడు యధావిధిగా ఆమె షాప్ రన్ అవుతుంది.
#BBUtsavam షో లో #KumariAunty !
అందరికీ NonVeg భోజనం కూడా… pic.twitter.com/SfmCzFSjOd
— Rajesh Manne (@rajeshmanne1) February 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.