Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు 10లో సామాన్యులు.. అగ్నిపరీక్ష అప్లికేషన్స్‌పై కీలక ప్రకటన.. వీడియో

  గత సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా బిగ్ బాస్ లో సామాన్యులకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం అగ్ని పరీక్ష కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ కోసం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడీ అగ్ని పరీక్ష పోటీలపై బిగ్ బాస్ నిర్వాహకులు కీలక ప్రకటన విడుదల చేశారు.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు 10లో సామాన్యులు.. అగ్నిపరీక్ష  అప్లికేషన్స్‌పై కీలక ప్రకటన.. వీడియో
Bigg Boss Telugu 10 Agnipariksha

Updated on: Jun 20, 2026 | 6:40 AM

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ మరోసారి రెడీ అవుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలో 10వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు జోడించనున్నారు. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా దాదాపు 100 రోజుల పాటు బిగ్ బాస్ షోను రన్ చేయనున్నారు. కాగా ఎప్పుడూ లేనట్లు తొమ్మిదో సీజన్ లో సామాన్యులకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. అగ్ని పరీక్ష ద్వారా పడాల పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, దివ్య లిఖిత, హరిత హరీశ్, డిమోన్ పవన్ వంటి వారిని కంటెస్టెంట్స్ గా ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. చివరకు వీరిలోనే ఒకరైన పవన్ కల్యాణ్ పడాల విజేతగా ఆవిర్భవించడం విశేషం. దీంతో పదో సీజన్ లోనూ కామన్ మ్యాన్స్ కు ఎంట్రీ ఉంటుందని ఇదివరకే షో నిర్వాహకులు ప్రకటించారు. త్వరలోనే అగ్నిపరీక్ష పెట్టి సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

కాగా జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు అగ్ని పరీక్ష ఆడిషన్స్‌కు వీడియోలు పంపవచ్చని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అభ్యర్థులు సుమారు 3 నిమిషాల నిడివితో అభ్యర్ధులు తమ గురించి, తమ ట్యాలెంట్ గురించి తెలియజేస్తూ వీడియో పంపాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారు bbtelugu.jiostar.comలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని నాగార్జున పేర్కొన్నారు. వీడియో నీట్ గా, క్లారిటీగా ఉండాలని స్పష్టమైన ఉచ్ఛారణతో పాటు ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా చూసుకోవాలని అభ్యర్ధులకు సూచించారు. ఇదిలా ఉంటే ఇవాళ్టి (జూన్ 20) తో బిగ్‌బాస్ 10 అగ్నిపరీక్ష అప్లికేషన్ల దరఖాస్తుల గడవు ముగియనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు అందుకోవాలంటే కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఇప్పుడు అలాంటి అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చిందని నాగార్జున వాయిస్‌తో ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా అగ్నిపరీక్ష సీజన్ 1లో పాల్గొని బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్స్‌గా అవకాశం దక్కించుకున్న పడాల పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, దివ్య లిఖిత, హరిత హరీశ్, డిమోన్ పవన్ తదితరులు అప్పుడు తాము ఎంత కష్టపడింది ఈ వీడియోలో చూపించారు.

మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us