అటు మోడ్రన్‌గా..ఇటు అమ్మవారిగా.. టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?

పలు తెలుగు సీరియల్స్ లో నటించిన ఈ అందాల తార ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేసింది. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. టైటిల్ గెలవలేకపోయినా టాప్-5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

అటు మోడ్రన్‌గా..ఇటు అమ్మవారిగా.. టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?
Priyanka Jain

Updated on: Jan 18, 2026 | 9:17 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే సడన్‌గా అందరూ పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016లో జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ అప్పటి సంగతులు, మధుర జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. పలువురు సినిమా తారలు కూడా ‘2016.. నోస్టాల్జిక్ వైబ్స్’ అంటూ పదేళ్ల నాటి ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. దీంతో ఇప్పుడు #2016, #nostalgic హ్యాష్ ట్యాగ్ లు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు బ్యూటీ, ఒక ప్రముఖ నటి కూడా తన చిన్ననాటి ఫొటోస్ షేర్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను పంచుకుంది. ఓ వైపు మోడ్రన్ డ్రెస్ లో సెల్ఫీలు, మరోవైపు అమ్మవారి వేషం, ఇంకో ఫొటోలో రెండు జడలు వేసుకుని పిండి రుబ్బడం, అలాగే తన గురించి పలు మ్యాగజైన్లలో వచ్చిన ఫొటోలు, ఫ్లెక్సీలు.. ఇలా చాలా ఫొటోలను షేర్ చేసుకుందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మొదట చాలా మంది ఆమెను గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంతకీ ఈ ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా?

బిగ్ బాస్ షోలో టాప్-5లో నిలిచి..

ప్రముఖ బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.మౌనరాగం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ జానకి కలగనలేదు సీరియల్‌తో మరింత పాపులరైంది ఇదే క్రేజ్ తో బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లోనూ కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా టాప్-5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

పదేళ్ల క్రితం ప్రియాంక జైన్..

సీరియల్స్, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే ప్రియాంక జైన్ లవ్, డేటింగ్, మ్యారేజ్ విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మౌనరాగం సీరియల్‌ లో తనతో కలిసి నటించిన శివకుమార్‌తో ప్రేమలో ఉంది ప్రియాంక జైన్. ఇప్పుడు వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే 2024 ఏప్రిల్‌లో వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ చోట భూమి కొన్నారు. గతేడాది మంచి ముహూర్తం చేసుకుని ఇంటి పనులు కూడా మొదలుపెట్టారు. ఇంటి పనులు పూర్తి కాగానే ఈ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..