AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : లక్షల జీతం వచ్చే జాబ్ వదిలేసి అమ్మ కోసం బిగ్ బాస్‏లోకి.. ఇప్పుడు విన్నర్ రేసులో..

లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి, అమ్మ ఇష్టం కోసం బిగ్ బాస్ వేదికపైకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ 'అగ్ని పరీక్ష' సీజన్ 2 లో తన ప్రశాంతమైన ప్రవర్తన, మెచ్యూరిటీతో ఆకట్టుకున్న ఆయన, ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి విన్నర్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచారు.

Bigg Boss 10 Telugu : లక్షల జీతం వచ్చే జాబ్ వదిలేసి అమ్మ కోసం బిగ్ బాస్‏లోకి.. ఇప్పుడు విన్నర్ రేసులో..
Biggboss 10
Rajitha Chanti
|

Updated on: Oct 03, 2026 | 2:54 PM

Share

ప్రస్తుత కాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తెచ్చుకోవడం, ప్రతినెల లక్షల జీతం సంపాదించడం చాలామంది కల. అయితే, మనసుకి నచ్చిన ఆశయం కోసం, కుటుంబం , అమ్మ కల నెరవేర్చడం కోసం అంతటి విలువైన IT ఉద్యోగాన్ని సైతం వదులుకోవడానికి కొందరే ధైర్యం చేస్తారు. అలాంటి ఒక అరుదైన వ్యక్తిత్వమే రోహిత్ నాయుడు. ఇటీవల బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష’ సీజన్ 2 లో తన ప్రతిభతో ప్రత్యేక ఆకట్టుకుని, బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోట్టాడు రోహిత్. మొదటి రోజు నుంచి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు. అంతకుముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత పయనాన్ని, ఐటీ జాబ్ వదులుకోవడానికి గల కారణాలను పంచుకున్నారు.

రోహిత్ ది విజయవాడ స్వస్థలం కాగా, గత 15-16 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. నెలకు లక్షల జీతం వచ్చే మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్‌ను గడిపిన అతడు, బిగ్ బాస్ కోసం ఆ ఉద్యోగానికి వదులుకున్నారు. రోహిత్ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఆయన తల్లికి రియాలిటీ షోలంటే ఎంతో ఇష్టమట. అమ్మతో కలిసి బిగ్ బాస్ షోలు చూస్తూ పెరిగిన రోహిత్, తానూ ఒకరోజు ఈ ప్లాట్‌ఫామ్‌పై నిలబడాలని బలంగా అనుకున్నానని అన్నారు. కేవలం సినిమాల్లో ఆఫర్లు లేదా ప్రసిద్ధి కోసం కాకుండా, చిన్ననాటి నుంచి ఉన్న పాషన్ ,అమ్మ ఇష్టపడే రియాలిటీ షోలో తానూ ఒక భాగం కావాలనే ఆశయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

అగ్ని పరీక్ష గేమ్ షోలో రోహిత్ చూపించిన ప్రశాంతత, మెచ్యూరిటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టాస్క్ సమయంలో కంగారు పడే సహచర కంటెస్టెంట్ రాజకుమారిని “నాన్న.. ప్రశాంతంగా ఉండు” అంటూ పాంపర్ చేస్తూ, ఆమె ధైర్యాన్ని పెంచి టాస్క్ పూర్తి చేయడంలో రోహిత్ వ్యవహరించిన తీరు విశేష ప్రశంసలు అందుకుంది. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత త్రిగుణ్ టార్గెట్ చేయడం.. టాస్కులలో తన ఆట తీరుతో ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

రోహిత్..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Follow Us