Brahmamudi, November 8th episode: కావ్యని క్షమించని రాజ్.. కనకం, కృష్ణ మూర్తిలను మరోసారి అవమానించిన అపర్ణ!

|

Nov 08, 2023 | 10:26 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యని మనస్ఫూర్తిగా స్వీకరించాలని సీతా రామయ్య రాజ్ దగ్గర మాట తీసుకుంటాడు. కానీ రాజ్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఎన్ని జరిగినా ఈ ఇల్లు ముక్కలు కాకూడదని నాలాగే నువ్వూ కోరుకుంటున్నావని నాకు తెలుసమ్మ. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుందని సీతా రామయ్య అంటాడు. ఏంటి బావా ఇప్పుడు ఈ అప్పగింతలు ఏంటి? అన్నీ నువ్వు అనుకున్నట్టు నేను చేస్తాను కదా.. నువ్వేం భయ పడకు అని ఇందిరా దేవి గదిలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత అక్కడేం జరిగి ఉంటుందో అని కనకం, కృష్ణ మూర్తిలు కంగారు..

Brahmamudi, November 8th episode: కావ్యని క్షమించని రాజ్.. కనకం, కృష్ణ మూర్తిలను మరోసారి అవమానించిన అపర్ణ!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యని మనస్ఫూర్తిగా స్వీకరించాలని సీతా రామయ్య రాజ్ దగ్గర మాట తీసుకుంటాడు. కానీ రాజ్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఎన్ని జరిగినా ఈ ఇల్లు ముక్కలు కాకూడదని నాలాగే నువ్వూ కోరుకుంటున్నావని నాకు తెలుసమ్మ. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుందని సీతా రామయ్య అంటాడు. ఏంటి బావా ఇప్పుడు ఈ అప్పగింతలు ఏంటి? అన్నీ నువ్వు అనుకున్నట్టు నేను చేస్తాను కదా.. నువ్వేం భయ పడకు అని ఇందిరా దేవి గదిలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత అక్కడేం జరిగి ఉంటుందో అని కనకం, కృష్ణ మూర్తిలు కంగారు పడుతూ ఉంటారు. మన పిల్లల గురించి ఏం నిర్ణయం తీసుకున్నారో అని ఆలోచిస్తూ తల పగిలి పోతుంది. మనం కూడా వెళ్దాం అంటే.. గొడవ అవుతుంది అని అంటారని కంగారు పడుతుంది కనకం.

అత్తింట్లో ఏం జరిగిందోనని కనకం కంగారు:

స్వప్న తప్పు చేశాక ఏం మొహం పెట్టుకుని వెళ్తాం చెప్పు.. మనల్ని ఆ ఇంట్లో తల ఎత్తుకోకుండా చేసిందని కృష్ణ మూర్తి అంటాడు. దాని కోసం.. పాపం కావ్య ఏం చేస్తుందో అని.. ఆ రోజు ఎవరో ఏదో అన్నారని ఎవరికీ చెప్పకుండా కావ్య ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. ఇప్పుడు అంత మంది వద్ద అనే సరికి మనల్ని ఇబ్బంది పెట్టకూడదని ఎక్కడికైనా వెళ్లి పోయి ఉంటుందని కనకం అంటుంది. ఈ లోపు కావ్యకి ఫోన్ చేస్తారు. ఏమైంది అక్కడ ఎలా ఉందని అడుగుతారు. పెద్దాయన ఏమన్నారు అని అడుగుతుంది కనకం. ఏంటి కావ్యా మాట్లాడకు.. లేదమ్మా తాతయ్య మనల్ని ఇక్కడే ఉండమన్నారు. అందరూ ఆ మాటకే కట్టుబడాలని చెప్పారు. కానీ తాతయ్యకి క్యాన్సర్ అంట నాన్నా. ఇప్పుడు ఆఖరి స్టేజ్ లో ఉందని డాక్టర్లు చెప్పారట అని కావ్య చెప్తూ బాధ పడుతుంది. ఇది విన్న కనకం, కృష్ణ మూర్తిలు కూడా బాధ పడతారు.

ఇవి కూడా చదవండి

పెళ్లి ముహుర్తాలు పెట్టించమన్న అనామిక.. నిజం చెప్పిన కళ్యాణ్:

ఆ తర్వాత కళ్యాణ్ కి కాల్ చేస్తుంది అనామిక. ఏంటి సార్ నిన్నటి నుంచి అసలు కాల్ లేదు.. బిజీ అయిపోయారా అని అనామిక అడుగుతుంది. మా డాడ్ నీతో మాట్లాడమన్నారని అనామిక అంటే.. ఏ విషయం గురించి అని కళ్యాణ్ అడుగుతాడు. ఏ విషయం గురించి అని అడుగుతావేంటి? అని అనామిక అంటే పెళ్లి గురించి అని అనామిక అంటుంది. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం అని కళ్యాణ్ అంటాడు. ఏమైందని అని అడుగుతుంది అనామిక. మా తాతయ్యకి క్యాన్సర్.. ఈ విషయం తెలిసి ఇంట్లో అందరూ అప్ సెట్ అయ్యారు. ఇప్పుడు పెళ్లి విషయం మాట్లాడటం కరెక్ట్ కాదని కళ్యాణ్ అంటాడు. థాంక్స్ అని చెప్తాడు కళ్యాణ్.

నాకు ఈ విషయం ఎందుకు ముందే చెప్పలేదు.. సుభాష్ ని నిలదీసిన అపర్ణ:

పెద్దాయనకు క్యాన్సర్ అన్న విషయం తెలిసి అపర్ణ బాధ పడుతుంది. ఇంత పెద్ద విషయం తెలిసాక.. చెప్పకుండా ఎందుకు ఉన్నారు. నాకూ చెప్పాలనిపించలేదా? అని సుభాష్ అని అడుగుతుంది. మావయ్య గారికి అలా ఉందంటే ఎంత కష్టంగా ఉంటుంది. మీరూ మీ అబ్బాయి చాలా గొప్పవాళ్లు. మేము పరాయి వాళ్లం అయిపోయాం అంతే కదా అని అపర్ణ అంటుంది. చూడూ.. మీరందరూ బాధ పడతారని చెప్పలేదు. ఇప్పుడు చేయడానికి కూడా ఏమీ లేదు. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకో. రుద్రాణి, స్వప్నల నుండి ఏ గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్నని సంతోషంగా చూసుకోవడం మన బాధ్యత అని సుభాష్ అంటాడు.

కనకం, కృష్ణ మూర్తిలను మరోసారి అవమానించిన అపర్ణ.. అడ్డుకున్న సుభాష్:

సీతా రామయ్యకు క్యాన్సర్ అన్న విషయం తెలుసుకున్న కనకం, కృష్ణమూర్తి పలకరిద్దామని వస్తారు. వాళ్లను చూసిన అపర్ణ ఆవేశ పడుతుంది. మళ్లీ ఏం గొడవ చేయాలని వచ్చారు? అంటూ వాళ్లపై ఊగిపోతుంది అపర్ణ. పెద్దాయనకు బాలేదని తెలిసింది. ఆయన్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. కానీ రాకూడదని సమయంలో వచ్చాం. మేము వెళ్లి పోతాం అండి అని కృష్ణ మూర్తి, కనకం వెళ్లి పోతారు. ఆగండి అని సుభాష్ ఆపి.. మా నాన్నకి అలా జరిగిందని తెలిసి.. అపర్ణ ఆవేశంతో మాట్లాడింది మమ్మల్ని క్షమించండి. నాన్న గారూ బెడ్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు వెళ్లి మాట్లాడండి.. అని సుభాష్ అంటాడు. ఆ తర్వాత అపర్ణకు గట్టి వార్నింగ్ ఇస్తాడు సుభాష్.

సీతా రామయ్య, ఇందిరా దేవిలను చూసి బాధ పడ్డ కనకం, కృష్ణ మూర్తిలు:

ఇక సీతా రామయ్య, ఇందిరా దేవి ఇద్దరూ బాధ పడుతూంటారు. అప్పుడే కనకం, కృష్ణ మూర్తిలు లోపలికి వస్తారు. వాళ్లను చూసిన సీతా రామయ్య.. ఏంటి మా వాళ్లు మీకూ ఫోన్ చేసి కంగారు పెట్టేశారా. ఇప్పుడు ఏమైందని అంతలా బాధ పడుతున్నారు. మీ పిల్లల జీవితానికి వచ్చిన సమస్య ఏమీ లేదని చెప్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా మా పిల్లల జీవితాల గురించి ఆలోచించారని కనకం, కృష్ణ మూర్తిలు అంటారు. మీ కూతుళ్లకు పెళ్లి చేసి మా ఇంటికి పంపారు. ఇక నుంచి వాళ్లు ఈ ఇంటి పిల్లలు. వాళ్లకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది అని అంటాడు సీతా రామయ్య. మేము వచ్చింది వాళ్ల కోసం కాదండి.. మిమ్మల్ని పలకరించి వెళ్దామని కనకం, కృష్ణ మూర్తిలు అంటారు.

స్వప్న, రాహుల్ ల మధ్య ఘర్షణ.. సైటెంట్ గా ఉండమన్న రుద్రాణి:

ఈ సీన్ కట్ చేస్తే.. నీ నిజస్వరూం అంతా ఇంట్లో తెలిసి పోయిందని రాహుల్ అంటే.. నువ్వు చేసిందేంటి మరి ఇంట్లో అందరూ అర్థం చేసుకున్నారు.. కానీ నువ్వు చేసుకోవడం లేదని స్వప్న అంటుంది. నేను నిన్న మోసం చేయలేదు. కానీ నువ్వు నన్ను మోసం చేశావ్ అని రాహుల్ అంటే.. నాకు ముందు ఆస్తి ఉందని తెలిసి.. ఆ తర్వాత లేదని కోటీశ్వరుల కూతుర్ని పెళ్లి చేసుకోవడం మోసం కాదా అని స్వప్న అంటుంది. అది నా ఇష్టం అని రాహుల్ అంటే.. మరి నాతో తిరిగింది పెళ్లి చేసుకోవడానికి అని ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. కానీ రాహుల్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది స్వప్న. వీళ్లద్దర్నీ చూసిన రుద్రాణి.. కనీసం ఈ టైమ్ లో అయినా ప్రేమిస్తున్నట్టు నటించండి. లేదంటే మనవళ్లే మీ తాతయ్య ఆరోగ్యం పాడవుతుంది అంటారు. ఇంట్లో నుంచి పంపించేసినా పంపించేస్తారు అంటుంది రుద్రాణి.

కావ్యని క్షమించని రాజ్.. శత్రువులా చూడటం కరెక్ట్ కాదంటున్న కావ్య:

మరోవైపు కావ్య గురించి ఆలోచిస్తాడు రాజ్. కావ్య మోసం చేసిందని తలుచుకుంటూ ఇంకా కావ్యపై ద్వేషం పెంచుకుంటాడు. గదిలోకి వచ్చిన కావ్యను చూసిన రాజ్.. బయటకు వెళ్లిపోతుంటే.. కావ్య పిలుస్తుంది. నాతో మాట్లాడటానికి కూడా ఇష్ట పడటం లేదని నాకు తెలుసు. తెలిసి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావని రాజ్ అంటాడు. అయితే మనం బంధం అంతేనా.. ఇలా గొడవ జరిగిన ప్రతి సారి నన్ను శత్రువులా చూడటం కరెక్ట్ కాదు అండి అని కావ్య అంటుంది. అంటే ఇప్పటికీ నీ తప్పు లేదనుకుంటున్నావా అని రాజ్ అడిగితే.. తప్పు చేశాను కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా ఉన్నాను. కానీ అబద్ధం చెప్పలేదని కావ్య చెబుతున్నా.. రాజ్ వినిపించుకోడు. ఇక ఈ రోజుతో ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.