Bigg Boss 5 Telugu: నటరాజ్ మాస్టర్ విచిత్ర ప్రవర్తనకు అంతా షాక్.. దండం పెట్టిన లోబో..

బిగ్‏బాస్ సీజన్ 5 ఇప్పటివరకూ చప్పగానే కొనసాగుతుందనుంటారు నెటిజన్స్.. నామినేషన్స్ ప్రక్రియలో మాత్రమే హౌస్ మేట్స్ రెచ్చిపోయి కనిపిస్తున్నారు

Bigg Boss 5 Telugu: నటరాజ్ మాస్టర్ విచిత్ర ప్రవర్తనకు అంతా షాక్.. దండం పెట్టిన లోబో..
Lobo

Updated on: Sep 29, 2021 | 7:18 AM

బిగ్‏బాస్ సీజన్ 5 ఇప్పటివరకూ చప్పగానే కొనసాగుతుందనుంటారు నెటిజన్స్.. నామినేషన్స్ ప్రక్రియలో మాత్రమే హౌస్ మేట్స్ రెచ్చిపోయి కనిపిస్తున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు చిన్న చిన్న టాస్కులతో నెట్టుకొచ్చాడు బిగ్ బాస్. మరోవైపు కంటెస్టెంట్స్ మధ్య విభేదాలు మాత్రం రోజు రోజుకీ తారా స్తాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే రవి మాట్లాడిన తీరుతో ప్రియ, లహరి మధ్య పెద్ద యుద్ధమే నడిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియలో లోబో సైతం సైకోలా మారిపోయాడు. పెద్దగా అరుస్తూ.. ప్రియా పై విశ్వరూపం చూపించేసాడు. ప్రియాపై ఆరోపణలు చేస్తూ శ్రుతి మించి ప్రవర్తించాడు. ఇక అదే విషయాన్ని తలుచుకున్ని నిన్న ఏడ్చేసింది ప్రియ. అలాగే నిన్నటి ఎపిసోడ్‏లో (సెప్టెంబర్ 29న) రవి వెళ్లి నటరాజ్ మాస్టర్ ను గుంటనక్కా నేనే కదా అని అడగడం.. దీంతో ఊసరవెళ్లి కూడా ఉందని చెప్పాడు. ఇవే మాటలను విశ్వ దగ్గర చెబుతూ.. నువ్వు గుంటనక్కా అనేది నాకు కరెక్ట్ పేరు అని అన్నావట కదా అని ప్రశ్నించాడు. దీంతో నేను అనలేదని బుకాయించాడు విశ్వ.

ఇక ఆ తర్వాత.. శ్రీరామ్.. తన గానమృతంతో మరోసారి ఇంటి సభ్యులను అలరించాడు. జన్నలేదేలే అనే పాట పాడుతూ.. ప్రియను ఏడ్పించేశాడు. శ్రీరామ్ సాంగ్ నచ్చిన ప్రియాంక అతని దగ్గరు వెళ్లి మరి హగ్ ఇచ్చింది. అయితే నిన్నటి ఎపిసోడ్‏లో నటరాజ్ మాస్టర్ విచిత్రంగా ప్రవర్తించాడు. తనలో తాను మాట్లాడుకుంటూ.. పెద్ద పెద్ద నవ్వుకుంటూ.. చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. మంచి బలం ఉన్న ఫిజికల్ టాస్క్ పెడితే నా వేట ఏంటో చూపిస్తా అంటూ తనలో తనే మాట్లాడుకుంటూ పిచ్చి పచ్చిగా ప్రవర్తించాడు. దీంతో నటరాజ్ మాస్టర్ విచిత్ర ప్రవర్తన చూసి ఇంటి సభ్యులు షాకయ్యారు. ముఖ్యంగా లోబో మాత్రం నటరాజ్ మాస్టర్ ను చూసి భయపడిపోయాడు. అయితే ప్రియాంక మాత్రం.. నటరాజ్ మాస్టర్ పిచ్చి చేష్టలు చూసి పడి పడి నవ్వుకుంది. వర్కౌట్ చేశాక నా మైండ్ షార్ప్ అయ్యిందని నటరాజ్ మాస్టర్ పెద్దగా నవ్వుతుంటే లోబో అతన్ని చూసి.. టాస్క్ సంగతి ఏమో గానీ.. మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందని దండం పెట్టేశాడు.

Also Read: Prabhas: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్‌.. సలార్‌ బడ్జెట్‌లో సగం అందుకే ఖర్చు చేస్తోన్న ప్రశాంత్‌ నీల్‌.

Bigg Boss 5 Telugu: గుంటనక్కే కాదు.. ఊసరవెళ్లి కూడా ఉందంటున్న నటరాజ్ మాస్టర్.. పాపం.. రవి బాధ వర్ణనాతీతమే..

Sonu Sood: మరో ముందడుగు వేసిన కలియుగ కర్ణుడు.. ఉచితంగా సోనూసూద్‌ ఈఎన్‌టీ సేవలు. ఎలా ఉపయోగించుకోవాలంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us