Ariyana: బిగ్‌బాస్ సీజన్ 4 హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి.. తనదైన ఆట తీరు, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది యాంకర్ అరియానా గ్లోరీ.. మొదట్లో నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నా.. రాను రాను తన మాట, ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరేట్ కంటెస్టెంట్‌గా మారింది. ఒకనొక సమయంలో అరియానా ఫైనల్ విజేత కావాలని నెట్టింట్లో కామెంట్లతో రచ్చ చేసిన సందర్భాలున్నాయి. ఇంట్లో ఉన్న అబ్బాయిలకు గట్టి పోటినిస్తూ.. సింగిల్‌గా ఫైనల్ వరకు వచ్చింది. అప్పటి వరకు చాలా తక్కువ మందికి తెలిసిన అరియానా.. ఈ షో తర్వాత ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుంది. దాదాపు 15 వారాలు ఇంట్లో సందడి చేసిన అరియానాకు ఈ షో తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో అరియానా బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 5 ముచ్చట్లను చెప్పేందుకు రెడీ అయ్యింది. బిగ్‌బాస్ బజ్ హోస్ట్ గా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేసింది స్టార్ మా, స్టార్ మా మ్యూజిక్.
తాజాగా అరియానా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బిగ్‌బాస్ షో గురించి అందులో ఎలిమినేట్ అయ్యే వారి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ బజ్ చేయడం నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే నేను హౌస్‌లో ఉన్నప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఈరోజు ఎలిమినేట్ అయ్యే వ్యక్తిని ఫేస్ చేయబోతున్నా.. ఆ వ్యక్తి ఎవరనేది నాకు తెలీదు. హౌస్ నుంచి బయటకు వచ్చే వ్యక్తికి నేను ఇచ్చే సందేశం ఒకటే. జీవితం చాలా పెద్దది. ప్రతి ఒక్కటి ఒక అనుభవం. ఇది చాలా పెద్ద అనుభవం.. ఈ అనుభవం నుంచి జీవితాన్ని ఇంకా చూడబోతున్నారు. జీవితమే ఒక పెద్ద ఛాలెంజ్. బాధగా ఉన్నా.. దాన్ని స్వీకరించాల్సిందే.. అని అరియానా చెప్పుకొచ్చింది.
ఇన్‌స్టా పోస్ట్..