Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌లోకి లక్స్‌ పాప! ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే షాకే

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 07 లేదా సెప్టెంబర్ 15న ఈ షో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ సారి కంటెస్టెంట్ల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది బిగ్ బాస్ యాజమాన్యం.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌లోకి లక్స్‌ పాప! ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే షాకే
Bigg Boss Telugu 9, Tollywood Actress

Updated on: Aug 14, 2025 | 7:22 PM

‘లక్స్ పాప… లక్స్ పాప… లంచ్‌కి వస్తావా! లడ్డు తినిపిస్తావా!’ అంటూ ‘నరసింహ నాయుడు’ సినిమాలో నందమూరి బాలకృష్ణతో స్టెప్పులేసిన అమ్మాయి గుర్తుందా? అదేనండీ ఆశా షైనీ. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అమ్మాయి ఆ మధ్యన పలు కారణాలతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఈ ముద్దుగుమ్మ పేరు మార్మోగిపోతోంది. దీనికి కారణం బిగ్ బాస్. అవును.. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి ఆశా షైనీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. పంజాబ్ రాజధాని ఛండీగఢ్‌లో పుట్టి పెరిగిన ఈ అందాల తార మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. తన ఫ్యామిలీ కోల్ కతాకు షిఫ్ట్ కావడంతో మిస్ బెంగాలీ అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 1999లో ‘ప్రేమకోసం’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. నరసింహ నాయుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతా మన మంచికే, మనసున్న మారాజు, చాలా బాగుంది, చెప్పాలని ఉంది, సర్దుకుపోదాం రండి, అక్కా బావెక్కడ, నవ్వుతూ బ్రతకాలిరా, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావ్ , ఓ చిన్నదాన తదితర సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. ఇక పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ సినిమా 143లో ఆశా పోషించిన జర్నలిస్ట్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత చట్టం, బ్రోకర్, ఆ ఇంట్లో, మనీ మనీ మోర్ మనీ తదితర తెలుగు సినిమాల్లో సహాయక నటిగానూ మెప్పించిందీ అందాల తార. అయితే 2011 తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు అశా శైని.

బాలీవుడ్ కు వెళ్లిపోయిన ఆశా షైనీ తన పేరును ఫ్లోరా షైనీ గా మార్చుకుంది. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ముఖ్యంగా ఏక్తా కపూర్ నిర్మించిన కొన్ని బోల్డ్ వెబ్ సిరీసులతో అక్కడి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గా ఉన్న ఈ అందాల తార ఆ మధ్యన ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డానని.. అతడు తనని చిత్రహింసలకు గురి చేశాడంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

లక్స్ పాప లేటెస్ట్ ఫొటోస్..

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న ఫ్లోరా షైనీ తరచూ తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ ను అందులో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో అడల్ట్ అండ్ బోల్డ్ సిరీస్ లు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తే ఆడియెన్స్ ఎలా రెస్పాన్స్ అవుతార చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.