Singer Mangli: మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంగ్లీ.. ఆ అరుదైన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..

Singer Mangli: న్యూస్‌ చానల్‌లో చిన్న యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి నేడు సినిమాల్లో పాటలు పాడే స్థాయికి ఎదిగారు మంగ్లీ. తెలంగాణ భాషను స్పష్టంగా పలికే తీరు..

Singer Mangli: మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంగ్లీ.. ఆ అరుదైన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి..
Singer Mangli

Edited By:

Updated on: Oct 28, 2021 | 6:26 AM

Singer Mangli: న్యూస్‌ చానల్‌లో చిన్న యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి నేడు సినిమాల్లో పాటలు పాడే స్థాయికి ఎదిగారు మంగ్లీ. తెలంగాణ భాషను స్పష్టంగా పలికే తీరు, పాటకే జోష్‌ నింపే గొంతు ఆమె సొంతం. ఇలా తనదైన ట్యాలెంట్‌తో అనతికాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు మంగ్లీ. జానపదాల నుంచి సినిమా వరకు అన్ని రకాల పాటలకు ప్రాణం పోస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కేవలం తెర వెనకే పరిమితం కాకుండా ఇటీవల మంగ్లీ తెరపై కూడా తళుక్కుమంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ సినిమాలో మంగ్లీ నటించిన విషయం తెలిసిందే.

డబ్బు కోసం జనాలను మోసం చేసే వ్యక్తి పాత్రలో కనిపించిన మంగ్లీ క్యారెక్టర్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మంగ్లీ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి.

ఇదిలా ఉంటే మంగ్లీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్‌ స్పాట్‌లో దిగిన కొన్ని ఫోటోలు, వీడియాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన మంగ్లీ.. ‘మాస్ట్రో షూట్‌కి సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలు’ అనే క్యాప్షన్‌ను జోడించారు. మరి మంగ్లీ పంచుకున్న ఈ మెమోరీస్ ఏంటో మీరూ చూసేయండి..

Also Read: Khel Ratna Award 2021: ఖేల్ రత్నా అవార్డుల లిస్టులో ఎవరున్నారంటే?

Pushpa: పుష్ప నుంచి మూడో సాంగ్.. గురువారం ఉదయం ‘సామీ సామీ’ పాట విడుదల..

Divorce: విడాకులకు రాజధాని హైదరాబాద్.. కొద్దిపాటి మనస్పర్థలకే విడిపోతున్న జంటలు.. దూరమవుతున్న ప్రేమానురాగాలు!