పొన్నియిన్ సెల్వన్.. ఈ సినిమా సృష్టిస్తోన్న సంచలనాలకు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడేలా కనిపించడం లేదు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు రికార్డులను తిరగరాస్తోంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ హౌజ్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. విక్రమ్, జయంరవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిషలాంటి భారీ స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా గత రికార్డులను తిరగరాస్తుంది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సంపాదించుకొని రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది.
మరీ ముఖ్యంగా తమిళనాట ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమా రికార్డులను సైతం బ్రేక్ చేయడం విశేషం. విక్రమ్ బాక్సాఫీస్ వద్ద రూ. 180 కోట్లు వసూలు చేయగా.. పొన్నియిన్ సెల్వన్ ఒక్క తమిళనాడులోనే ఇప్పటికే రూ. 186 కోట్లను రాబట్టడం విశేషం. ఇంకో వారం రోజుల్లో పొన్నియిన్ సెల్వన్ రూ. 200 కోట్ల మార్క్‌ను దాటుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇకా ఓవర్సీస్లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఏకంగా రూ. 35 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పొన్నియిన్ సెల్వన్ ఏకంగా రూ. 408 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 2 కూడా రానున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..