Cinema : హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇదే..

1972లో విడుదలైన ఓ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఆఫ్రికన్ సినిమా రీమేక్‌గా రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరించిన ఈ సినిమా, ఆరేళ్ల మాస్టర్ రాము, ఒక కుక్కపిల్ల చుట్టూ తిరుగుతుంది. చిత్రీకరణలో ఎదురైన సవాళ్లు, కెమెరామెన్ కృషి, భావోద్వేగ నేపథ్య సంగీతం దీనిని జాతీయ అవార్డు విజేతగా నిలబెట్టాయి.

Cinema : హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇదే..
Paapam Pasivaadu 1972

Updated on: Oct 12, 2026 | 8:24 PM

1972 అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాపం పసివాడు చిత్రం అప్పటివరకు తెలుగులో వచ్చిన సినిమాలకు భిన్నంగా నిలిచి ఒక అద్భుతంగా కీర్తించబడింది. ప్రముఖ రచయిత, దర్శకులు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనంగా నిలిచింది. ఒకే ఒక్కడు ప్రాణాలతో మిగిలిన ఆరేళ్ల పసివాడు, అతడితో పాటు ఓ కుక్క పిల్ల ఎడారిలో సాగించిన అన్వేషణ, వారికి ఎదురైన అనుభవాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రం ఆఫ్రికా సినిమా ఏ లాస్ట్ బాయ్ ఇన్ ది డిసర్ట్ కు రీమేక్. ఆఫ్రికా సినిమా హక్కులు కొనుగోలు చేసి, ఆ తర్వాత తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ సినిమాలో ప్రధానంగా ఒక పిల్లాడు మాత్రమే కనిపిస్తాడు. మిగిలిన వారందరూ చిన్న చిన్న సహాయక పాత్రల్లో కనిపిస్తారు. సినిమా ఎక్కువ భాగం ఆరేళ్ల పిల్లాడు, అతడి కుక్క చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాకి ప్రాణం పోసిన ఆ బుడ్డోడి పేరు మాస్టర్ రాము.

సినిమా చిత్రీకరణ అత్యంత సవాళ్లతో కూడుకున్నది. రాజస్థాన్ ఎడారిలో దాదాపు 30 రోజులకు పైగా షూటింగ్ చేశారు. ఏసీ సౌకర్యం ఉన్న వాహనాలు దొరకని ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. ఇక ఎడారిలో చిత్రీకరణ అంటే అది మరింత క్లిష్టమైన విషయం. పైగా, ఆరేళ్ల చిన్న పిల్లాడితో సినిమా తీయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్లాడి చేత నటించడం డైరెక్టర్లకు సవాలుగా మారింది. మాస్టర్ రాము డైరెక్టర్ చెప్పినట్లుగా నటించేవాడు కాదు. దీంతో కెమెరామెన్ అటు ఇటు తిప్పుతూ ఆ పిల్లాడి సహజమైన ఎక్స్ప్రెషన్‌లను పట్టుకున్నారు. ఈ సినిమాలో కెమెరామెన్ కృషి ప్రశంసనీయం. కథ మొత్తం ఆ పిల్లాడిదే కాబట్టి, కెమెరా యాంగిల్స్ అన్నీ అతడి పక్క నుంచే ఉంటాయి. ఒకవేళ కెమెరామెన్ ఆ షాట్స్ తీయడంలో ఏమాత్రం తడబడినా ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించేది కాదేమో. ఆ రోజుల్లో జూమ్ లెన్స్ లేవు. కేవలం కెమెరాను భుజాలపై వేసుకుని, పిల్లాడి వెంట పరుగులు తీసి అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాలో కొన్ని షాట్స్ చూస్తే, ఈ సినిమా కోసం కెమెరామెన్ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది.

ఈ సినిమాకు మరో ప్రధాన బలం నేపథ్య సంగీతం. కన్నీరు పెట్టించే ఈ సినిమాకు ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అవ్వడానికి చెల్లెలు శారద అందించిన నేపథ్య సంగీతం ఒక ముఖ్య కారణం. ఆరేళ్ల పిల్లాడు, ఒక కుక్కపిల్ల మధ్యన నడిచే సన్నివేశాలకు తన సంగీతంతో మరింత ప్రాణం పోశారు. సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. అలాగే కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రేక్షకులు సీట్లలో నుంచి కదలకుండా కట్టిపడేసింది. ఈ సినిమాకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు కూడా లభించింది. మాస్టర్ రాముకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షూటింగ్‌లో పిల్లాడు తప్పించుకుపోతాడనే భయంతో మేకప్ ఆర్టిస్ట్ నరసింహారావు అతడిని ఎప్పుడూ ఒక గొలుసుతో కట్టేసి ఉంచేవారట. ఎవరూ లేనప్పుడు ఆ గొలుసు పట్టుకుని కూర్చునేవాడట పాపం. ఆ తర్వాత మాస్టర్ రాము చదువుపై శ్రద్ధ పెట్టడం కోసం సినిమాలకు దూరమయ్యాడు. ఆ రోజుల్లోనే ఈ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగి, ఒక చిన్నారి తారగా గుర్తింపు పొందాడు.

ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..

Loading...
Unable to load recommendations.
Follow Us