
నిజ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న ఒక సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పరిష్కారం కాని ఒక కేసులోని కోణాలను, బాధితుల కుటుంబం వేదనను, న్యాయం కోసం ఆ ఫ్యామిలీ చేసిన పోరాటాన్ని చూపించినప్పుడు.. ప్రతి ఒక్కరూ ఆ బాధకు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ సినిమా విడుదలైనప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేరుకే హారర్ సినిమా.. కానీ ఆ కథ మాత్రం హృదయవిదాకరమైనది. ఈ చిత్రం 2024లో విడుదలైంది. ఈ హారర్-థ్రిల్లర్ చిత్రానికి ఏంజీ ఉంబారా దర్శకత్వం వహించగా, ధీరజ్ కల్వానీ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నైలా డి. పూర్ణమ, గిసెల్మా ఫిర్మాన్స్య, లిడియా కందావ్, ప్రీత్ తిమోతి, డెలియా హుస్సేన్, యూసుఫ్ మహార్దిక, ఫహద్ హైద్రా వంటి నటీనటులు నటించారు. ఈ చిత్ర కథ, నటీనటులందరి నటనకు విశేష ప్రశంసలు లభించాయి. నేటికీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రజల గుండెలు కంపించిపోతాయి. ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పేరు ‘వీణా కే వో సాత్ దిన్’.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
ఈ సినిమా కథ మొత్తం వీణ, ఆమె స్నేహితురాలి ఆకస్మిక, రహస్య మరణం చుట్టూ తిరుగుతుంది. మొదట అది ఒక రోడ్డు ప్రమాదంలా అనిపిస్తుంది, కానీ కాలం గడిచేకొద్దీ, కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చి ఆ ప్రమాదాన్ని ఒక పెద్ద కుట్రగా మారుస్తాయి. వీణ ఆత్మ తన ప్రాణ స్నేహితురాలి శరీరంలోకి ప్రవేశించి, ఆమె కుటుంబానికి పూర్తి నిజం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కథలో కొత్త మలుపు వస్తుంది. వీణపై 13 మంది పురుషులు సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను, ఆమె స్నేహితురాలిని దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత, వారు ఒక్కొక్కరిగా శిక్షించబడతారు. విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లు కిక్కిరిసిపోయాయి. థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు సుమారు 58 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అప్పట్లో ఇది పెద్ద రికార్డ్. భారతదేశంలో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా వేయగా, IMDbలో దీనికి 5.4 రేటింగ్ ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
థియేటర్లలో సంచలనం సృష్టించిన తర్వాత, ఈ చిత్రం ఓటీటీ విడుదలై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాకు ఇప్పటికీ విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. దీని వాస్తవిక , భావోద్వేగభరితమైన కథ, అద్భుతమైన హారర్ సన్నివేశాల కారణంగా ఈ చిత్రం ఇప్పటికీ సినీ ప్రేమికులచే ఎంతగానో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..