
ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మట్లాడుకుంటున్న ఓ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఆ మూవీ పేరు తడయం. విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. 2026లో విడుదలైన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రాలలో ఇది ఒకటి. నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
1999లో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొత్తం ఆరు ఎపిసోడ్లతో ఉంటుంది ఈ సినిమా. ఒక్కో ఎపిసోడ్ నిడివి 17 నిమిషాల నుంచి 29 నిమిషాల వరకు ఉంటుంది. మొత్తం సిరీస్ కేవలం 130 నిమిషాల్లో పూర్తవుతుంది. ఆద్యంతం ఊహించని సస్పెన్స్ తో ఈ సినిమా సాగుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..
కథ విషయానికి వస్తే.. 1999లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లోని ఓ ప్రాంతంలో వరుసగా అర్ధరాత్రి పూట దారుణమైన హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును డీల్ చేయడానికి ఎస్ఐ అధియమాన్ (సముధ్రఖని) రంగంలోకి దిగుతాడు. కానీ అప్పటికే తోటి పోలీసుల అవమానాలు భరించలేక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటాడు. రాత్రిళ్లు హత్య చేసే హంతకుడు ఆడవాళ్ల మెడలోని తాళిబొట్టు, మగవాళ్ల మొలతాడు మాత్రమే దొంగిలిస్తాడు. ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీని అధియమాన్ ఎలా చేధిస్తాడు.. ? ఆ హంతకుడు ఎవరు ? అనేది సినిమా.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..