OTT Movie: ఒకే రాత్రి మూడు హత్యలు.. 250 మిలియన్స్‌ ప్లస్ వ్యూస్‌తో ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్

రా అండ్ రస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ తెలుగు వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. ఏకంగా 250 మిలియన్స్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ తో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

OTT Movie: ఒకే రాత్రి మూడు హత్యలు.. 250 మిలియన్స్‌ ప్లస్ వ్యూస్‌తో ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్
OTT Movie

Updated on: May 26, 2026 | 6:02 PM

సినిమాలైనా, వెబ్ సిరీస్ లైనా ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్లదే హవా. ముఖ్యంగా ఓటీటీల్లో ఇప్పుడు ఈ జానర్ కంటెంటే ఎక్కువగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో తెరకెక్కుతోన్న క్రైమ్ సినిమాలు, సిరీస్ లకు విశేష స్పందన లభిస్తోంది. అలా ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు కొల్లగొడుతోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని చేరుకుంది.‌ ఏకంగా 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఈ సిరీస్ స్టోరీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్ పరధిలోని ఓ బస్తీలో ఒకే రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. దీంతో నగర ప్రజలు ఉలిక్కిపడతారు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ రంగంలోకి దిగుతారు. తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారికి సంచలన విషయాలు తెలుస్తాయి. మరి ఈ హత్యల వెనక ఎవరున్నారు? క్షుద్ర పూజలు, నరబలులు ఏమైనా ఉన్నాయా? అన్నది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోన్న ఈ తెలుగు వెబ్ సిరీస్ పేరు ధూల్ పేట పోలీస్ స్టేషన్. జశ్విని తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో.. అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, గురు, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఏ మాత్రం బోర్ కొట్టకుండా సాగుతుంది. కాగా ఇప్పటివరకు ఈ సిరీస్‌ ఏకంగా 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలతో ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ తన అప్రతిహత యాత్రను కొనసాగిస్తోంది. ఓటీటీలో బిగ్గెస్ట్ లాంగ్ ఫార్మాట్ క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది’ స్ట్రీమింగ్ మినిట్స్ పరంగా చూసుకుంటే ఓటీటీ చరిత్రలోనే అతిపెద్ద లాంగ్ ఫార్మాట్ క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా ఇది నిలిచింది’ అని ఆహా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఆహా ఓటీటీలో ధూల్ పేట పోలీస్ స్టేషన్ వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us