OTT Movie: నిజ జీవిత సంఘటనలతో సినిమా.. ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీంతో మొదటి నుంచే వివాదాలతో వార్తలో నిలిచిందీ సినిమా. ఇక తీరా మూవీ రిలీజయ్యాక ఆ నిరసనల వేడి మరింత పెరిగింది. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి.

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో సినిమా.. ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Parasakthi Movie

Updated on: Feb 07, 2026 | 8:45 AM

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ ఓ మోస్తరుగా ఆడాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఆ సినిమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ది రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేయగా శనివారం (ఫిబ్రవరి 07) అర్ధరాత్రి నుంచి మరో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వంలో పీరియాడికల్ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి, రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రలు పోషించారు. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన పరాశక్తి సినిమా మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు ఈ మూవీ కేవలం తమిళ్ వెర్షన్ లో మాత్రమే రిలీజైంది. థియేటర్ల కొరతతో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కాలేదు. మరోవైపు సినిమాను వరుస వివాదాలు వెంటాడాయి.

1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా పరాశక్తి సినిమాను తెరకెక్కించారు సుధ కొంగర. దీంతో మొదటి నుంచి ఈ సినిమా పై వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇక మూవీ రిలీజయ్యాక ఆ నిరసనల వేడి మరింత పెరిగింది. పరాశక్తి సినిమాను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ కూడా చేసింది. అయినా ఇలా వివాదాలు చెలరేగినా, మిక్స్ డ్ టాక్ వచ్చినా పరాశక్తి సినిమాకు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని చిత్ర బృందం పేర్కొంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 07 నుంచి శివ కార్తికేయన్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే శనివారం అర్ధరాత్రి నుంచే పరాశక్తి సినిమా జీ5 ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

జీ 5లో పరాశక్తి సినిమా స్ట్రీమింగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..