AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రీసెంట్ హిట్ మూవీ .. తెలుగుతో సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

మే 01న థియేటర్లలో విడుదలైన ఈ సస్పెన్స్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. సోమవారం (మే 22) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన రీసెంట్ హిట్ మూవీ .. తెలుగుతో సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 25, 2026 | 5:05 PM

Share

మత్తు వదలరా 2 వంటి సూపర్ హిట్ తర్వాత కమెడియన్ సత్య హీరోగా నటించిన మరో సినిమా జెట్లీ. రితేష్ రానా ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రియా సింఘా హీరోయిన్‌గా నటించింది. అలాగే వెన్నెల కిషోర్, అజయ్, వైవా హర్ష, గెటప్ శ్రీను, కబీర్ దుహాన్ సింగ్ లాంటి స్టార్స్ ఈమూవీలో భాగమయ్యారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. ఇలా భారీ అంచనాల మధ్య మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జస్ట్ యావరేజ్ గా నిలిచింది. మత్తువదలరా 2 రేంజ్ లో ఉంటుందేమోనని థియేటర్లకు వెళ్లిన జనాలకు ఈ సినిమా ఓ మోస్తరుగా మాత్రమే నచ్చింది. అయితే ఎప్పటిలాగే సత్య కామెడీ టైమింగ్ అదిరిపోయిందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. జెట్లీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్డేట్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

తెలుగుతోపాటుగా తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో జెట్లీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ అంతా ‘స్వింగ్‌ఫిషర్ 6EB1CH’ అనే ప్యాసింజర్ విమానం లోపల జరుగుతుంది. దేశం విడిచి పారిపోవాలని చూస్తున్న ఒక అపర కుబేరుడిని ఆ విమానంలో తరలిస్తుంటారు. అదే సమయంలో కొందరు కిరాయి గూండాలు, రహస్య ఏజెంట్లు ఆ ఫ్లైట్ లోకి ప్రవేశించడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సస్పెన్స్, యాక్షన్, కామెడీ కలబోసిన ఈ సినిమాను థియేటర్లలో చూడలేదా? అయితే ఓటీటీలో ఒక లుక్ వేసుకోవచ్చు.

Follow Us
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు