
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులో ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతి క్రేజ్ ను క్యాష్ చేసుకున్న ఈ సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమాలన్నీ ఓటీటీలనూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రభాస్, శర్వానంద్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు సినిమాల అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్స్ వచ్చేశాయి. అయితే మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరుగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్నారు. ఈ మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. అలాగే సునీల్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు అందించారు.
#BharthaMahasayulakuWignyapthi Total Worldwide Closing Collections
Ap/Tg Gross – ₹14 CR Approx
Karnataka Gross – ₹1.4 CR
Tamilnadu+Rest of India Gross – ₹0.35 CRTotal All India Gross – ₹15.75 CR
Overseas Gross – ₹2.6 CR ($290K)Total Worldwide Final Collections
Gross… pic.twitter.com/iVeezjufmb— NEWS Boxoffice (@NEWS_BOXOFFICE) February 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.