
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వృది సినిమాస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెద్ది చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి స్వరాలందించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న విడుదలైన పెద్ది సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు పెద్ది సినిమాకు సుమారు రూ.400 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ ఈ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. దీనికి తోడు కొత్త సీన్లు కూడా జత చేశారు. కాబట్టి పెద్ది సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడీ పెద్ది సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈ మెగా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
పెద్ది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూ. 105 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూలై ఆఖరు లేదా ఆగస్టు మొదట్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఓటీటీ ఆడియెన్స్ కోసం థియేటర్లలో కత్తిరించిన జగపతి బాబు, జాన్వీ కపూర్‌ల కీలక సీన్లను తిరిగి జోడించినున్నారు. ఏకంగా 3 గంటల 25 నిమిషాల నిడివితో కూడిన ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారని టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
The #Peddi experience gets better 🤩
5 mins 56 seconds of new scenes will be added from tomorrow in theatres.
🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/N91oIPEYdR
— PEDDI (@PeddiMovieOffl) June 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి