OTT Movie: 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ.. నిజంగా జరిగిన క్రైమ్ స్టోరీ..

సాధారణంగా థియేటర్లలో విడుదలైన మూడు, నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి సినిమాలు. కొంచెం పెద్ద సినిమాలైతే ఐదారు వారాలు తీసుకుంటున్నాయి. అయితే ఈ సినిమా ఏకంగా 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అది కూడా ఓ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ.

OTT Movie: 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ.. నిజంగా జరిగిన క్రైమ్ స్టోరీ..
OTT Movie

Updated on: Sep 30, 2026 | 10:00 AM

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీలో రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అయిన షాహిద్ అజ్మీ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు. వర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు ఇందులో లీడ్ రోల్ పోషించారు. 2013లో థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం సుమారు 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా పేరు ‘షాహిద్’. 2010లో ముంబైలో హత్యకు గురైన ప్రముఖ న్యాయవాది షాహిద్ అజ్మీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. లీడ్ రోల్ లో రాజ్‌కుమార్ రావు ఒదిగిపోయారు. అలాగే మహమ్మద్ జీషన్ అయ్యూబ్, ప్రభలీన్ సంధు, బల్జిందర్ కౌర్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. 61వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హన్సల్ మెహతా ‘ఉత్తమ దర్శకుడు’ అవార్డును గెలుచుకోగా, రాజ్‌కుమార్ రావు ‘ఉత్తమ నటుడు’ అవార్డును గెలుచుకున్నారు. అయితే వివిధ కారణాలతో ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు నోచుకోలేదు. ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన 13 సంవత్సరాల తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది

అమెజాన్ ప్రైమ్ వీడియోలో షాహిద్ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభం కాగానే, చిత్ర రచయిత, ఎడిటర్ అపూర్వ అశ్రాని ‘X’ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. అవార్డులు గెలుచుకుని, ప్రశంసలు పొందిన ఒక చిత్రానికి ఓటీటీ వేదిక దొరకడానికి 13 సంవత్సరాలు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు. “జాతీయ అవార్డు అందుకున్న షాహిద్ చిత్రం ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఓటీటీకి చేరడానికి 13 ఏళ్లు పట్టింది. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న అమాయకుల తరఫున కోర్టులో పోరాడి, నేరం రుజువు కాకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన లాయర్ షాహిద్ అజ్మీ కథను ఈ చిత్రం చెబుతుంది. ‘ఈ చిత్రం 2014 రాజకీయ మార్పులకు ఒక సంవత్సరం ముందు విడుదలైంది. ఆ తర్వాత, అసమ్మతి వ్యక్తం చేసేవారిని, హక్కుల కార్యకర్తలను, భావజాలాలను ప్రశ్నించేవారిని అనుమానంతో చూసే వాతావరణం ఏర్పడింది. అలాంటి కథలను చెప్పడానికి పూనుకున్న దర్శకులు, రచయితలు, నటీనటులు చిత్ర పరిశ్రమలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత షాహిద్ సినిమా ఓటీటీలోకి రావడానికి కారణం ఏమిటి? ప్రజల ఆలోచనా విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? కారణం ఏదైనప్పటికీ, ఈ సాహసోపేతమైన చిత్రంలో భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. మీరు ఇంకా చూడకపోతే, తప్పకుండా చూడండి, అని అపూర్వ అశ్రాని ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో షాహిద్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us