Ustaad Bhagat Singh: అప్పుడే ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’! ఆ రోజు నుంచే పవన్ కల్యాణ్ సినిమా స్ట్రీమింగ్ !

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చినా కామన్ ఆడియెన్స్ కు మాత్రం పెద్దగా ఎక్కలేదు.

Ustaad Bhagat Singh: అప్పుడే ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్! ఆ రోజు నుంచే పవన్ కల్యాణ్ సినిమా స్ట్రీమింగ్ !
Ustaad Bhagat Singh

Updated on: Mar 27, 2026 | 6:10 PM

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేన్ లో వచ్చిన రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలాగే రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో మెరిసింది. కోలీవుడ్ నటుడు పార్తీబన్ ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేశారు. ఉగాది కానుకగా 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మరీ సూపర్ హిట్ టాక్ రాకపోయినా మంచి టాక్ వచ్చింది. పవన్ కల్యాణ్ స్టైల్ యాక్షన్, మాస్, ఎలిమింట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే హరీశ్ శంకర్ మార్క్ డైలాగులు, శ్రీలీల, రాశీ ఖన్నా అంద చందాలు ఆడియెన్స్ ను మెప్పించాయి. ఇక తొలిప్రేమ సినిమాలోని ‘ఈ మనసే ‘ సాంగ్ రీమిక్స్ కు అయితే థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. . సినిమాలో ఇన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నా కథ, కథనాల పరంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కాస్త వీక్ అనిపించింది. దీనికి తోడు పోటీగా ధురంధర్ 2 సినిమా రిలీజ్ కావడం ఉస్తాద్ కు మైనస్ గా మారింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమాకు ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

కాగా థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఉస్తాద్ భగత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడు పోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని ప్రెస్ మీట్ లో వెల్లడించిన ప్రకారం థియేటర్లలో విడుదలైన తర్వాత సుమారు 5 వారాల గ్యాప్ తోనే ఉస్తాద్ సినిమా ఓటీటీలోకి వస్తుందన్నారు. ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే పవన్ కల్యాణ్ సినిమా ఏప్రిల్ 16 లేదా 24 న స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే థియేట్రికల్ రన్ ను బట్టి ఈ తేదీలలో స్వల్పంగా మార్పులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 16 లేదా 24న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us