
ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, యాక్షన్ ,కామెడీ, ఫ్యామిలీ, సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్.. ఇలా అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఎక్కువ మంది ఆడియెన్స్ మాత్రం కేవలం సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకే ఓటేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా మరీ ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు. మీరు కూడా ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ లేదావెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఎంతో థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమాలో ట్విస్టులు మామూలుగా ఉండవు. కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. థియేటర్లలో పాటు ఓటీటీలోనూ ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉండడం విశేషం. స్టోరీ విషయానికి వస్తే.. ఇదొక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్.. హీరో కుమార్ ఒక క్రైమ్ ఇన్స్పెక్టర్. ఒక దొంగను పట్టుకునే క్రమంలో జిమ్ ట్రైనర్ అతని భార్యను క్రూరంగా హత్య చేయడం గమనిస్తాడు. అతనిని పట్టుకునే క్రమంలో తోపులాట జరిగి జిమ్ ట్రైనర్‌ను కుమార్ పొడవటంతో అతను అక్కడికక్కడే మరణిస్తాడు. కుమార్ కు కూడా తీవ్ర గాయాలవుతాయి. ఉద్యోగంలో చేరడానికి మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం తిరుగుతాడు. ఈ క్రమలోనే సైకోథెరపిస్ట్ అదిరతో పరిచయం మొదలవుతుంది. మరోవైపు నగరంలో వరుసగా హత్యలు కలకలం రేపుతాయి.అసలు ఈ హత్యలకు కారణమెవరు? రక్తం చూడగానే భయపడిపోయే కుమార్ ఈ సీరియల్ మర్డర్స్ కేసును ఎలా చేధించాడన్నదే ఈ సినిమా కథ.
ఓటీటీలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా చెప్పుకునే ఈ సినిమా పేరు ప్రాజెక్ట్ – Z. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సీవీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరో కుమార్ పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఆకట్టుకుంది. వీరితో పాటు దివంగత నటుడు డేనియల్ బాలాజీ, జయప్రకాష్, దర్శకుడు కే ఎస్ రవికుమార్, మైమ్ గోపీ, భాగవతి పెరుమాళ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు ఆడియెన్స్ కు కచ్చితంగా ఆకట్టుకుంటాయి. సినిమా రిలీజై చాలా ఏళ్లయినా ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు దాదాపు 7 పైనే రేటింగ్ ఉండడం విశేషం. కాగా ఈ సినిమా యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉంది..
ఆహాలో ప్రాజెక్ట్ 2 సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.