
ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ది ఒడిస్సీ, ప్రేమనే ఊరిలో, కికూ చిరంజీవి, కల్ట్, అనుపమ క్రేజీ కల్యాణం, మయూఖ, హైకూ, అనుమాన పక్షి, చిరం, 418 వంటి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటే ఒక తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. పేరుకు ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు చాలా ఉన్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈసర్వైవల్ థ్రిల్లర్ తమిళ ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఐఎమ్ డీబీలో ఈ లవ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఏకంగా 9.5 రేటింగ్ దక్కడం విశేషం. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూర్య (అశోక్ సెల్వన్), ఇయల్ (ప్రీతి ముఖుందన్) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఓ హిల్ స్టేషన్లో అందమైన ఇంటిని కొనుగోలు చేస్తాడు సూర్య. ఇక్కడే అసలు ట్విస్ట్. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత సూర్య- ఇయల్ జీవితాల్లో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ప్రాణాపాయ స్థితి నుంచి భార్యను కాపాడుకునేందుకు హీరో ఏం చేశాడు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే
ఇవాళే ఓటీటీలోకి ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అన్బిల్ అవన్’. డెబ్యూ డైరెక్టర్ ఆర్. కార్తికేయన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అశోక్ సెల్వన్ , ప్రీతిలతో పాటు రేవతి, అబ్దుసమద్, కదిర్బాలు రాజనాయగం తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ కుమారన్ ఫిల్మ్స్, ఐంగరన్ ఇంటర్నేషనల్, హ్యాపీ హై పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. . ’96’ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత్ ఈ సినిమాకు సంగీతం అందించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన అన్బిల్ అవన్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు,క న్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఓటీటీలో మంచి లవ్ కమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి అన్బిల్ అవన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.