AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : అడవిలో తలలేని శవం.. క్షణక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో టాప్‏లో ట్రెండింగ్ అవుతున్న సినిమా..

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'జానావర్' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అడవిలో తల లేని మృతదేహం లభించడంతో మొదలయ్యే పోలీస్ దర్యాప్తు, ఊహించని ట్విస్టులతో సాగుతుంది. నటుడు భువన్ అరోరా నటన, ఉత్కంఠభరిత కథనం ఈ 7 ఎపిసోడ్ల సిరీస్‌ను థ్రిల్లర్ ప్రియులకు తప్పక చూడాల్సిన చిత్రంగా నిలబెట్టాయి.

Cinema : అడవిలో తలలేని శవం.. క్షణక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో టాప్‏లో ట్రెండింగ్ అవుతున్న సినిమా..
Janaawar
Rajitha Chanti
|

Updated on: Oct 03, 2026 | 2:27 PM

Share

ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలపై క్రైమ్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అదే బాటలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘జానావర్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ కథ అంతా ఒక దట్టమైన అటవీ ప్రాంతం సమీపంలో జరుగుతుంది. పోలీసులకు అడవిలో తల లేని ఒక మృతదేహం లభించడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. దర్యాప్తు తీవ్రమవుతున్న కొద్దీ, ఇది కేవలం ఒక సాధారణ హత్య మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద మర్మమే దాగి ఉందనే నిజం బయటపడుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

కథ విషయానికి వస్తే.. తల లేని మృతదేహం ఎవరిది? అతడిని ఎవరు చంపారు? అనే ప్రశ్నలతో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. నిందితుడి కోసం వెతికే క్రమంలో పోలీసు అధికారులు ఎదుర్కొనే మానసిక ఘర్షణలు, స్థానిక వాతావరణం సిరీస్‌‌కి ప్రధాన బలంగా నిలిచాయి. మొత్తం 7 ఎపిసోడ్‌‌లుగా రూపొందిన ఈ సిరీస్‌లో ప్రతి నిమిషం ఊహించని మలుపులతో కథనం నడుస్తుంది. ‘ఫార్జీ’ వెబ్ సిరీస్ ద్వారా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు భువన్ అరోరా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. పోలీస్ అధికారిగా ఆయన చూపించిన హావభావాలు, గంభీరమైన నటన సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

అలాగే నేపథ్య సంగీతం మరియు సినిమాటోగ్రఫీ కథలోని భయాన్ని, గూఢచారాన్ని ప్రేక్షకులకు నేరుగా అనుభూతి చెందేలా చేశాయి. అడవిలోని చీకటి వాతావరణాన్ని కెమెరాలో బంధించిన తీరు థ్రిల్లర్ ప్రేమికులను కట్టిపడేస్తుంది. మొత్తంగా 7 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ సీటు చివర కూర్చోబెట్టేలా సస్పెన్స్, క్రైమ్ అంశాలతో సాగుతుంది. థ్రిల్లర్ , మిస్టరీ జానర్ సిరీస్‌లను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ‘జానావర్’ ఒక మంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Follow Us