
ఈ సంక్రాంతికి తెలుగులో దాదాపు అరడజను వరకు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, రవి తేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుము మురారీ, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. పండగ సెలవులను సద్వినియోగం చేసుకుంటూ దాదాపు అన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడీ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్, శర్వానంద్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేయగా ఈ బుధవారం (ఫిబ్రవరి 11) అర్ధరాత్రి నుంచి మరో రెండు సూపర్ హిట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు గురించి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ ఏకంగా రూ. 400 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. నయన తార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడీ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సంక్రాంతికి సందడి చేసిన మరో సినిమా అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ లో నవీన్ పోలిశెట్టి, క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా బుధవారం అర్ధ రాత్రి నుంచే స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Mana Shankara Varaprasad garu vacchesaarahooo!! 🥁📣#ManaShankaraVaraPrasadGaru
STREAMING NOWMegastar @KChiruTweets
Victory @Venkymama@AnilRavipudi #Nayanthara @Shine_Screens @GoldBoxEnt#ManaShankarVaraPrasadGaruOnZee5 #Chiranjeevi #Teluguzee5 #AnilRavipudi pic.twitter.com/zBfrPxf5lQ— ZEE5 Telugu (@ZEE5Telugu) February 10, 2026
మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు సినిమాలతో మూవీ లవర్స్ కు ఈ వారం ఓటీటీలో మంచి ఎంటర్ టైన్మెంట్ దొరికిందనే చెప్పుకోవచ్చు. మరి థియేటర్లలో ఈ సూపర్ హిట్ సినిమాలను మిస్ అయ్యారా? లేదా? మళ్లీ చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేటు చూసి ఎంజాయ్ చేయండి.
Raju garu osthe no worrying! only glittering, shivering and flickering 🤣❤️ pic.twitter.com/lbrnI9tqcz
— Netflix India South (@Netflix_INSouth) February 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.